రాయలపేట అత్యాచార నిందితుడు అరెస్ట్

  • Published By: murthy ,Published On : November 3, 2020 / 04:26 PM IST
రాయలపేట అత్యాచార నిందితుడు అరెస్ట్

Updated On : November 3, 2020 / 4:38 PM IST

Rayalapeta Rape accused arrested : చిత్తూరు జిల్లా రాయల పేటలో ఈనెల 1వ తేదీన మైనర్ బాలికపై జరిగిన అత్యాచార కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పలమనేరు నియోజకవర్గంలోని పెద్ద పంజాణి మండలం రాయలపేట లో నవంబర్ 1వతేదీ రాత్రి 8 గంటల సమయంలో తన ఇంటి పక్కన ఉన్న 6 ఏళ్ల చిన్నారిపై నిందితుడు బత్తుల మహేష్ (28) అత్యాచారం చేసి పరారయ్యాడు. విషయం తెలిసి బాధితురాలి తల్లి తండ్రులు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.



కేసు నమోదు చేసుకున్నపోలీసులు దర్యాప్తు చేపట్టారు. గాలింపు చర్యల్లో భాగంగా 3వ తేదీ మధ్యాహ్నం12 గంటల సమయంలో నిందితుడు పెద్దపంజాణి మండలం పుంగనూరు -పలమనేరు రోడ్డు కోగిలేరు క్రాస్ వద్ద ఉండగా పోలీసులు అరెస్ట్ చేశారు.