టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వైసీపీ నేతలకు బిగ్ రిలీఫ్..!

ముందస్తు బెయిల్ కోసం దేవినేని అవినాశ్, జోగి రమేశ్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా కోర్టు ఈ కీలక ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.

టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వైసీపీ నేతలకు బిగ్ రిలీఫ్..!

Updated On : September 13, 2024 / 4:19 PM IST

Relief For Ysrcp Leaders : టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలకు ఊరట లభించింది. ఈ కేసులో వైసీపీ నేతలు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై ఇవాళ విచారించిన సుప్రీంకోర్టు.. దేవినేని అవినాశ్, జోగి రమేశ్ లకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించింది. అలాగే అవినాశ్, జోగి రమేశ్ లు తమ పాస్ పోర్టులను 48 గంటల్లోగా హైకోర్టుకు అప్పగించాలని ఆదేశించింది. ఇద్దరూ విచారణకు సహకరించాలని సుప్రీంకోర్టు సూచించింది.

టీడీపీ ఆఫీస్, చంద్రబాబు నివాసంపై దాడి కేసులో దేవినేని అవినాశ్, జోగి రమేశ్ లకు సుప్రీంకోర్టు మధ్యంతర రక్షణ కల్పించింది. ఈ కేసులో కీలక ఆదేశాలు జారీ చేసింది న్యాయస్థానం. రెండు కేసుల్లో నిందితులుగా ఉన్న వారంతా కూడా తమ పాస్ పోర్టులను వెంటనే దర్యాఫ్తు అధికారికి అప్పగించాలని ఆదేశించింది. ముందస్తు బెయిల్ కోసం దేవినేని అవినాశ్, జోగి రమేశ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పాస్ పోర్టులు సరెండర్ చేయాలని కోర్టు ఆదేశించింది కనుక ఎటువంటి అరెస్టులు ఉండే అవకాశం లేదని తెలుస్తోంది.

తదుపరి విచారణ జరిగేంత వరకు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని దర్యాఫ్తు అధికారులకు సూచించింది సుప్రీంకోర్టు. విచారణకు పూర్తి స్థాయిలో సహకరించాలని, ఎప్పుడు విచారణకు పిలిచినా వెళ్లాలని వైసీపీ నేతలను ఆదేశించింది సుప్రీంకోర్టు. నిందితులు విచారణకు సహకరించే వరకే వారిని అరెస్ట్ చేయకుండా ఈ రక్షణ ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ నిందితులు విచారణకు సహకరించకపోతే కచ్చితంగా వారిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. ముందస్తు బెయిల్ కోసం దేవినేని అవినాశ్, జోగి రమేశ్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా కోర్టు ఈ కీలక ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.

Also Read : ఏపీ రాజకీయాల్లో ఇదో కొత్త కోణం.. వరద విరాళాల వెనుక పక్కా వ్యూహం?

సాంకేతిక కారణాల రీత్యా ఇప్పుడు వీడియోలు చూడలేకపోతున్నామని, విచారణ కూడా చేపట్టలేకపోతున్నామని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అందువల్లనే ఈ కేసు విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. కాగా, ఇదే కేసులో ముందస్తు బెయిల్ ను హైకోర్టు నిరాకరించడంతో నిందితులుగా ఉన్న పలువురు వైసీపీ నేతలను (నందిగం సురేశ్, లేళ్ల అప్పిరెడ్డి) పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక, దేవినేని అవినాశ్, జోగి రమేశ్ లకు సుప్రీంకోర్టు ఆదేశాలతో అరెస్ట్ నుంచి మధ్యంతర రక్షణ దక్కినప్పటికీ.. వారిద్దరూ తమ పాస్ పోర్టులను దర్యాఫ్తు సంస్థలకు సరెండర్ చేయాల్సి ఉంటుంది. అలాగే తప్పనిసరిగా విచారణకు సహకరించాల్సిన అవసరం ఉంటుంది.