Vallabhaneni Vamsi : మార్చి 17వరకు రిమాండ్‌లోనే వల్లభనేని వంశీ..
దీంతో పీటీ వారెంట్ దాఖలు చేశారు సీఐడీ అధికారులు.

vallabhaneni vamsi Arrest
Vallabhaneni Vamsi : గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. విజయవాడ కోర్టులో సీఐడీ అధికారులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. జైల్లో ఉన్న వంశీని వర్చువల్ గా విచారించారు న్యాయమూర్తి. ఈ నెల 17వ తేదీ వరకు వంశీకి రిమాండ్ విధించారు. గతంలో ఇదే కేసులో బెయిల్ పిటిషన్స్ ను హైకోర్టు డిస్మిస్ చేసింది. దీంతో పీటీ వారెంట్ దాఖలు చేశారు సీఐడీ అధికారులు. గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో వంశీ ఏ71గా ఉన్నారు.
టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో ఇప్పటికే అనేక మందిని విచారించారు. 48 మంది అరెస్ట్ అయ్యారు. కొందరు బెయిల్ పై బయటకు వచ్చారు. కాగా వంశీని విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. టీడీపీ కార్యాలయంపై ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? కారణాలు ఏంటి? అనే కోణంలో పోలీసులు కస్టడీ పిటిషన్ వేసి విచారించే అవకాశాలు ఉన్నాయి.
Also Read : ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే? సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక భేటీ..
అటు సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని పల్నాడు జిల్లా నరసరావుపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పీటీ వారెంట్ పై అదుపులోకి తీసుకున్నారు. 153 ఏ, 504, 67 ఐటీ యాక్ట్ కింద కేసు నమోదైంది. రిమాండ్ రిపోర్టులో దాదాపు 15 కేసులు పోసానిపై రిజిస్ట్రర్ అయ్యాయి. నరసరావుపేటలోనూ కేసు నమోదు కావడంతో పీటీ వారెంట్ పై అక్కడికి తీసుకెళ్లారు. 4 రోజులుగా రాజంపేట సబ్ జైల్లో పోసాని రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
కాగా, తనకు ఆరోగ్యం బాగోలేదని చెప్పడంతో పోలీసులు ఆయనకు రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించారు. అక్కడి నుంచి నేరుగా కడప రిమ్స్ కి తరలించి వైద్యం అందించారు. పోసానికి వైద్య పరీక్షలు చేయగా.. ఆయన ఆరోగ్యంగా ఉన్నారని తేలింది. పోసాని నాటకం ఆడారని పోలీసులు కూడా చెప్పారు. ఆయన హెల్తీగా, ఫిట్ గా ఉన్నారని తెలిపారు. పోసానిని తిరిగి రాజంపేట సబ్ జైలుకి తరలించారు.