Kakinada YCP : కాకినాడ వైసీపీలో రాజీనామాల కలకలం.. టీడీపీలో చేరతామని ప్రకటన

రాజీనామాలు చేసిన వారిలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ జనపరెడ్డి సుబ్బారావు, కిర్లంపూడి ఎంపీపీ తోటరవి, జడ్పీటీసీ సభ్యురాలు తోట సత్యవతి, గండేపల్లి జడ్పీటీసీ సభ్యురాలు మంగతాయారు ఉన్నారు. వీరంతా టీడీపీలో చేరనున్నట్లుగా ప్రకటించారు.

Kakinada YCP : కాకినాడ వైసీపీలో రాజీనామాల కలకలం.. టీడీపీలో చేరతామని ప్రకటన

Resignations Row In Kakinada YCP

Updated On : December 26, 2023 / 8:46 PM IST

కాకినాడ జిల్లాలో వైసీపీ నేతలు రాజీనామాల బాట పట్టారు. జగ్గంపేట ఎమ్మెల్యే జోత్యుల చంటిబాబుకు వైసీపీ టికెట్ ఇవ్వడం లేదని సీఎం జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన చంటిబాబు వర్గం నేతలు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజీనామాలు చేసిన వారిలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ జనపరెడ్డి సుబ్బారావు, కిర్లంపూడి ఎంపీపీ తోటరవి, జడ్పీటీసీ సభ్యురాలు తోట సత్యవతి, గండేపల్లి జడ్పీటీసీ సభ్యురాలు పరిమి మంగతాయారు ఉన్నారు. వీరంతా టీడీపీలో చేరనున్నట్లుగా ప్రకటించారు.

అధికార వైసీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పు అంశం దుమారం రేపుతోంది. అభ్యర్థుల మార్పు వ్యవహారం గోదావరి జిల్లాల్లో హీట్ పెంచింది. జగ్గంపేట నియోజకవర్గం విషయానికి వస్తే ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుకు ఈసారి టికెట్ ఇచ్చేది లేదని సీఎం జగన్ ఇప్పటికే తేల్చి చెప్పేశారు. దీంతో ఎమ్మెల్యే అనుచరులు భగ్గుమన్నారు. రాజీనామా బాట పట్టారు. చంటిబాబు అనుచరులు నలుగురు రాజీనామా చేశారు. జ్యోతుల చంటిబాబుకు టికెట్ నిరాకరించడంతో అందుకు నిరసనగా తాము రాజీనామా చేస్తున్నామని తెలిపారు. అంతేకాదు టీడీపీలో చేరుతున్నామని కూడా ప్రకటించారు.

Also Read : వైఎస్ షర్మిల టీడీపీకి దగ్గర అవుతున్నారా?

జగ్గంపేట ఎమ్మెల్యే చంటిబాబుతో సీఎం జగన్ మాట్లాడిన తర్వాతి రోజే తాము రాజీనామా చేస్తామని ఎమ్మెల్యే అనుచరులు చెప్పారు. ఇందులో భాగంగానే ఇప్పుడు ఎమ్మెల్యే వర్గానికి చెందిన నలుగురు వ్యక్తులు వైసీపీకి రాజీనామా చేశారు. మరికొన్ని రోజుల్లో ఎమ్మెల్యే చంటిబాబు సైతం టీడీపీలో చేరతారనే వార్తలు వస్తున్నాయి. టికెట్ రాకపోవడంతో తీవ్ర అసంతృప్తిగా ఉన్న చంటిబాబు.. టీడీపీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. టీడీపీలో చేరిక విషయమై టీడీపీ పెద్దలు, స్థానిక కాపు సామాజికవర్గానికి చెందిన మాజీమంత్రితో చంటిబాబు మంతనాలు జరిపినట్లు సమాచారం.

కాకినాడ పార్లమెంటు నుంచి చంటిబాబు పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరో వారం రోజుల్లో చంటిబాబు ప్రకటన చేసే అవకాశం ఉందంటున్నారు. ఈ వ్యవహారంలో మరింత మంది రాజీనామాలు చేసే అవకాశం ఉందంటున్నారు. కాగా, చంటిబాబును కాదని స్థానికంగా ఉన్న మాజీమంత్రి తోట నర్సింహంకు వచ్చే ఎన్నికల్లో జగ్గంపేట టికెట్ ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారు.

Also Read : ఎన్నికల వేళ వైసీపీకి టీడీపీ బిగ్ షాక్..! పీకేను దూరం చేసిన నారా లోకేశ్