పోలవరం నిర్మాణ భాధ్యత కేంద్రానిదే : జీవీఎల్ నరసింహారావు

  • Published By: chvmurthy ,Published On : December 10, 2019 / 09:41 AM IST
పోలవరం నిర్మాణ భాధ్యత కేంద్రానిదే : జీవీఎల్ నరసింహారావు

Updated On : December 10, 2019 / 9:41 AM IST

ఏపీలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు పూర్తి ఖర్చును కేంద్రమే భరిస్తుందని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహా రావు చెప్పారు. కేంద్రం ఇప్పటివరకు రాష్ట్రానికి పోలవరం నిర్మాణం కోసం రూ.6764 కోట్లు ఇచ్చిందని ఆయన తెలిపారు.  అయితే 2014 ముందు చేసిన ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఇవ్వట్లేదని అన్నారు. 

పోలవరానికి నిధులు ఆగకుండా చూడాలని ఆయన కేంద్రాన్ని కోరారు. నిర్వాసితుల సమస్యలపై  కేంద్ర మంత్రి దృష్టి పెట్టాలని జీవీఎల్ సూచించారు.పోలవరం ప్రాజెక్టు పై మోడీ ఆసక్తిగా ఉన్నారని ప్రధాన మంత్రి ప్రాజెక్టుగా గుర్తిస్తూ రాష్ట్రప్రభుత్వం అక్కడ ఫలకం ఏర్పాటు చేయాలని జీవీఎల్ కోరారు.