Tirumala Arjita Services : తిరుమలలో ఆర్జిత సేవలు పునఃప్రారంభం.. నేటి నుంచి భక్తులకు అనుమతి

భక్తులు ఇవాళ్టి నుంచి ఆర్జిత సేవల్లో పాల్గొనడానికి వీలుగా ఇప్పటికే టీటీడీ ఆన్లైన్ ద్వారా సేవా టికెట్‌లను విక్రయించింది.

Tirumala Arjita Services : తిరుమలలో ఆర్జిత సేవలు పునఃప్రారంభం.. నేటి నుంచి భక్తులకు అనుమతి

Tirumala (2) (1)

Updated On : April 1, 2022 / 8:14 AM IST

Tirumala Arjita Services : తిరుమల శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలకు నేటి నుంచి భక్తులను అనుమతించారు. రెండేళ్ల తర్వాత భక్తులను ఆర్జిత సేవలకు అనుమతిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా 2020 మార్చిలో శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలకు భక్తుల అనుమతిని టీటీడీ నిలిపివేసింది. అప్పటి నుండి శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జిత సేవలు ఏకాంతంగానే జరుగుతున్నాయి. మళ్లీ నేటినుంచి ఆర్జిత సేవలు మొదలయ్యాయి.

భక్తులు ఇవాళ్టి నుంచి ఆర్జిత సేవల్లో పాల్గొనడానికి వీలుగా ఇప్పటికే టీటీడీ ఆన్లైన్ ద్వారా సేవా టికెట్‌లను విక్రయించింది. విపరీతమైన డిమాండ్ ఉన్న సుప్రభాతం, తోమాల, అర్చన, అభిషేకం లాంటి ఆర్జిత సేవా టిక్కెట్లను కూడా లక్కీ డిప్ విధానం ద్వారా కేటాయింపులు చేశారు. అయితే వృద్ధులు, వికలాంగుల దర్శనం టోకెన్ల ఆన్ లైన్ విడుదలను ఏప్రిల్ 1 నుండి 8 కి వాయిదా వేశారు.

TTD : తిరుమలలో ఏప్రిల్ 1 నుంచి వికలాంగుల, వృద్ధుల దర్శనాలు పున:ప్రారంభం

సాంకేతిక ఇబ్బందులు ఏర్పడటంతో ఆన్లైన్లో టోకెన్ల విడుదలను ఏప్రిల్ 8కి టిటిడి వాయిదా వేసింది. ఏప్రిల్ 8 న ఉదయం 11 గంటలకు వృద్ధులు, వికలాంగుల దర్శనం టోకెన్లను ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు. వృద్ధులు, వికలాంగుల కోసం ప్రతిరోజు వెయ్యి టిక్కెట్లను ఆన్లైన్ లో విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది.