Ring Nets Controversy : మరోసారి విశాఖలో ఉద్రికత్త.. రోడ్డు పైకి వేలాదిమంది మత్స్యకారులు

విశాఖలో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రింగు వలల వివాదం ఇంకా సద్దుమణగలేదు. వేలాది మంది మత్స్యకారులు రోడ్డుపైకి వచ్చారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న..

Ring Nets Controversy : మరోసారి విశాఖలో ఉద్రికత్త.. రోడ్డు పైకి వేలాదిమంది మత్స్యకారులు

Ring Nets Controversy

Ring Nets Controversy : విశాఖలో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రింగు వలల వివాదం ఇంకా సద్దుమణగలేదు. వేలాది మంది మత్స్యకారులు రోడ్డుపైకి వచ్చారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న తమ వారిని విడిచిపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మత్స్యకారులు రోడ్డుపైనే బైఠాయించారు. మంత్రులు, అధికారులతో చర్చలు బాయ్‌కాట్ చేస్తున్నట్టు మత్స్యకారులు ప్రకటించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న తమ వారిని విడిచిపెట్టే వరకు చర్చలకు వెళ్లేది లేదని తేల్చి చెప్పారు.

Farts Selling: పిత్తులు అమ్మే టీవీ స్టార్‌కు గుండెనొప్పి

విశాఖ హార్బర్ నుంచి భీమిలి తీరం వరకు దాదాపు అన్ని మత్స్యకార గ్రామాల ప్రజలు రింగు వలలతో చేపల వేట సాగిస్తున్నారు. అయితే, సాంప్రదాయ మత్స్యకారులు.. రింగు వలలను నిషేధించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. దీనిపై అధికారులతో చర్చలు జరిపినా.. ఫలితం లేకపోకపోయింది. కాగా, రింగు వలల బోట్లతో చేపల వేటకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. 13 బోట్లకు మాత్రమే రింగు వలలతో సముద్ర తీరానికి అనుమతిచ్చిన కోర్టు.. 8 కిలోమీటర్ల అవతల వేట చేయవచ్చని ఆదేశాలు జారీ చేసింది. అయితే.. రింగు వలల మత్స్యకారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, తీరానికి సమీపంలో వేట చేయటం వల్ల మత్స్య సంపద నాశనమైపోతోందని సాంప్రదాయ మత్స్యకారులు ఆరోపిస్తున్నారు.

Cold : జలుబుతో బాధపడుతున్నారా!…ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటే?

ఈ క్రమంలో పెద్దజాలరిపేట, చిన్నజాలరిపేట మత్స్యకారుల మధ్య రింగు వలల వివాదం మరోసారి చోటు చేసుకుంది. రింగు వలలతో మత్స్యకారులు వేటకు వెళ్లడంతో.. సాంప్రదాయ మత్స్యకారులు వారిని అడ్డుకోవడం ఘర్షణకు దారి తీసింది. సాంప్రదాయ మత్స్యకారులు బోట్లకు నిప్పంటించారు. ఈ ఘటనలో ఏడు బోట్లు కాలిపోగా.. నలుగురు జాలర్లకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వాసవానిపాలెం తీరం దగ్గర తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. అక్కడ భారీగా మోహరించారు. వాసవానిపాలెం, జాలరి పేటలలో 144 సెక్షన్ అమలు చేశారు.