విశాఖ షిప్‌యార్డ్ భారీ‌క్రేన్ ప్రమాద దుర్ఘటనలో పెరుగుతున్న మృతుల సంఖ్య

  • Published By: bheemraj ,Published On : August 1, 2020 / 03:29 PM IST
విశాఖ షిప్‌యార్డ్ భారీ‌క్రేన్ ప్రమాద దుర్ఘటనలో పెరుగుతున్న మృతుల సంఖ్య

Updated On : August 1, 2020 / 3:53 PM IST

విశాఖ హిందుస్తాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో ప్రమాదం జరిగింది. భారీ క్రేన్ విరిగిపడి 11 మంది మ‌ృతి చెందారు. షిప్ యార్డ్ సిబ్బంది క్రేన్ ను తనిఖీ చేస్తుండగా ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో క్రేన్ కింద చిక్కుకొని 10 మంది ప్రాణాలు కోల్పొయారు. 8 మందికి తీవ్ర గాయాలు ఉన్నాయి. మిగిలిన వారి పరిస్థితి విషమంగా ఉంది. వారిని చికిత్స కోసం హాస్పిటల్ కు తరలించారు.



మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు కూడా కన్పిస్తున్నాయి. లోడింగ్ పనులు పరిశీలిస్తుండగా క్రేన్ కుప్పకూలిపోయింది. క్రేన్ ను బిగిస్తుండగా కూలిపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. క్రేన్ కూలిపోయినప్పుడు ఘటనా స్థలంలో 18 మంది సిబ్బంది ఉన్నారు. కూలిపోయిన క్రేన్ కొత్తదని సిబ్బంది అంటున్నారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాద ఘటనపై విచారిస్తున్నారు. షిప్ యార్డ్ లో ప్రమాదంపై మంత్రి అవంతి శ్రీనివాస్ ఆరా తీశారు. క్షతగాత్రుల్ని వెంటనే మెరుగైన వైద్యం అందించాలని ఆర్టీవోకు ఫోన్ ద్వారా సూచించారు. హిందుస్తాన్ షిప్ యార్డ్ వద్ద రక్షణ శాఖ ఉద్యోగులు సహాయక చర్యలు చేపట్టారు.