Road Accident: అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తుఫాన్‌ వాహనం-లారీ ఢీ

అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తుఫాన్ వాహనం, లారీ ఢీకున్నాయి. ఈ ప్రమాదంలో..

Road Accident: అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తుఫాన్‌ వాహనం-లారీ ఢీ

Road Accident

Updated On : September 15, 2023 / 6:45 AM IST

Annamayya District Road Accident: అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కేవీ పల్లి మండలం మఠంపల్లి వద్ద లారీ – తఫాన్ వాహనం ఢీకున్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు. మరో 11మందికి గాయాలయ్యాయి. మృతులంతా కర్ణాటక రాష్ట్రం బెళగావి వాసులుగా గుర్తించారు. తుఫాన్ వాహనంలోని వారంతా తిరుమలకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిసింది.

Road Accident : జైపూర్-ఆగ్రా జాతీయ రహదారిపై బస్సు, ట్రక్కు ఢీ… 11 మంది మృతి

తెల్లవారు జామున 3.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదానికి కారణం డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లేనని సమాచారం. ఈ ఘోర రోడ్డు ప్రమాదం సమయంలో తుఫాన్ వాహనంలో మొత్తం 16 మంది ప్రయాణిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలంకు చేరుకొని క్షతగాత్రులను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.