కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం….ఎర్ర చందనం స్మగ్లర్ల సజీవ దహనం

  • Published By: murthy ,Published On : November 2, 2020 / 03:27 PM IST
కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం….ఎర్ర చందనం స్మగ్లర్ల సజీవ దహనం

Updated On : November 2, 2020 / 3:55 PM IST

Road Accident in kadapa district: కడప జిల్లాలో సోమవారం తెల్లవారు ఝూమున జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు సజీవ దహనం అయ్యారు వారంతా ఎర్రచందనం స్మగ్లర్లుగా పోలీసులు గుర్తించారు.

కడప-తాడిపత్రి రహదారిపై వల్లూరు మండలం గోటూరు వద్ద టిప్పర్ డీజిల్ ట్యాంక్ ను టాటా సుమో ఢీ కొట్టటంతో మంటలు చెలరేగాయి. అదే సమయంలో వేగంగా వస్తున్న మరో కారు సుమోను ఢీ కొట్టడంతో ఈ ఘోర ప్రమాదం సంభవించింది.



ఘటనలో సుమోలో ప్రయాణిస్తున్న నలుగురు సజీవ దహనం కాగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కంకరను ఊరు చివర అన్ లోడ్ చేసి తిరిగి వస్తున్న టిప్పర్ ను ఎర్ర చందనం తరలిస్తున్న సుమో ఢీ కొట్టింది. మరణించిన వారు తమిళనాడుకు చెందిన స్మగ్లర్లుగా పోలీసులు గుర్తించారు.