Road Accident: కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.

Road Accident: కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

Road Accident

Updated On : June 17, 2023 / 7:29 AM IST

Konaseema District: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఆలమూరు మండలం మడికి జాతీయ రహదారిపై శనివారం తెల్లవారు జామున గూడ్స్ ఆటో, కారు ఢీకొనడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. అనకాపల్లి మండలం చోడవరం నుండి గూడ్స్ ఆటోలో తొమ్మిది మంది మందపల్లికి వెళ్తున్నారు. విశాఖపట్నం నుండి పాలకొల్లు వెళుతున్న కారు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

Road Accident In Canada: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం..15మంది మృతి

ఈ ప్రమాదంలో గూడ్స్ ఆటోలో ముగ్గురు, కారులో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.