మటన్ ప్రియులూ జర జాగ్రత్త.. అధికారుల సూచన

rotten meat food seized : విజయవాడ పాతబస్తీలోని ఓ సెంటర్‌లో మాంసం దుకాణాలపై ఆదివారం ఫుడ్‌సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. కుళ్లిపోయిన మాంసం విక్రయాలు చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. పలు షాపుల్లో నిల్వ ఉంచిన మాంసాన్ని అధికారులు పరిశీలించారు.
కుళ్లిపోయి పురుగులు పట్టిన 70 కిలోల మేక మాంసాన్ని గుర్తించారు.. చనిపోయిన పొటేల్ మటన్‌ను విక్రయిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. నిల్వ చేసిన మేక తలకాయలను కూడా స్వాధీనం చేసుకున్నారు.
షాపు నిర్వాహకులను అదుపులోకి తీసుకుని, ఆయా మటన్ షాపులను సీజ్ చేసినట్టు ఫుడ్ సేఫ్టీ అధికారులు వెల్లడించారు. నిల్వ చేసి ఉన్న మటన్‌లో పురుగులు ఉన్నాయని, ఈ మాంసం తింటే ప్రజలు అనారోగ్యానికి గురవుతారని అన్నారు.
మటన్, చికెన్ కొనేవారంతా తాజా మాంసాన్నే కొనాలని సూచించారు. మటన్ షాపుల నుంచి స్వాధీనం చేసుకున్న మాంసం శాంపిల్స్‌ను అధికారులు ల్యాబ్‌కు పంపించారు. నిల్వ ఉంచిన మాంసం విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.