జేసీ బ్రదర్స్ కు మరో షాక్ : మళ్లీ వాహనాలు సీజ్ చేసిన అధికారులు

అనంతపురం జిల్లా రాజకీయాల్లో తిరుగులేని నేతలుగా ఉన్న జేసీ బ్రదర్స్ కు జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చుక్కలు చూపిస్తోంది. జిల్లా రాజకీయాల్లో కీలకంగా ఉండి చక్రం తిప్పిన నేతలు ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం చర్యలతో గడ్డు పరిస్ధితిని ఎదుర్కోంటున్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గడ్డు పరిస్ధితిని ఎదుర్కోంటున్న జైసీ బ్రదర్స్ అవకాశం ఉన్నప్పుడల్లా జగన్ కు కితాబిస్తూనే ఉన్నారు. అయిునా ప్రభుత్వం మాత్రం జేసీ బ్రదర్స్ కు చెందిన ట్రావెల్స్ లో అక్రమంగా తిప్పుతున్నవాహనాలపై కన్నేసి వాటిని సీజ్ చేస్తూనే ఉంది.
తాజగా జేసీ దివాకర్ రెడ్డికి రవాణా శాఖ అధికారులు మరోసారి ఝలక్ ఇచ్చారు. జేసీ ట్రావెల్స్ కు చెందిన వాహనాలను రవాణా శాఖ అధికారులు సీజ్ చేశారు. బీఎస్-3 వాహనాలను బీఎస్-4 వాహనాలుగా మార్చి నడుపుతున్నట్లు నిర్ధారణ కావటంతో వాహనాలను అధికారులు సీజ్ చేశారు.
వీటిని నాగాలాండ్ తోపాటు పలు ఇతర రాష్ట్రాల్లో రిజిష్ట్రేషన్ చేసినట్లు అధికారులు గుర్తించారు. గతంలో జేసీ బ్రదర్స్ కు చెందిన 57 వాహానాలను సీజ్ చేసిన అధికారులు ఈ రోజు 4 టిప్పర్లను సీజ్ చేశారు. జేసీ బ్రదర్స్ మొత్తం 154 వాహనాలను నిబంధనలకు విరుధ్ధంగా అక్రమంగా రిజిష్ట్రేషన్లు చేసిట్లు గుర్తించామని త్వరలో వాటన్నిటినీ సీజ్ చేస్తామని డీటీసీ శివరామ్ ప్రసాద్ చెప్పారు.