హైకోర్టును ఆశ్రయించిన సజ్జల రామకృష్ణా రెడ్డి.. ఎందుకంటే..

టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఇప్పటికే పోలీసులు కొందరు వైసీపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో తమ పేర్లు వినిపించడంతో.. వైసీపీ కీలక నేతలు అలర్ట్ అయ్యారు.

హైకోర్టును ఆశ్రయించిన సజ్జల రామకృష్ణా రెడ్డి.. ఎందుకంటే..

Sajjala Ramakrishna Reddy : వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఆయనీ పిటిషన్ వేశారు. సజ్జలతో పాటు ఆర్కే, దేవినేని అవినాశ్ పిటిషన్లపైనా రేపు(జూలై 10) హైకోర్టులో విచారణ జరగబోతోంది. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఇప్పటికే సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు వారిని విచారిస్తున్నారు.

టీడీపీ ఆఫీసుపై దాడి వెనుక వైసీపీ కీలక నేతల ప్రమేయం ఉందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వారి డైరెక్షన్ లోనే ఈ దాడి జరిగిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ నేతల దేవినేని అవినాశ్, లేళ్ల అప్పిరెడ్డి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ రెండు పిటిషన్లపై ఇవాళ విచారణ జరిగింది. తదుపరి విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది. తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి(ఆర్కే) కూడా హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఇప్పటికే పోలీసులు కొందరు వైసీపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో తమ పేర్లు వినిపించడంతో.. వైసీపీ కీలక నేతలు అలర్ట్ అయ్యారు. ఆ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని, కావాలనే తమను పోలీసులు అందులో ఇన్వాల్వ్ చేస్తున్నారని హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దేవినేని అవినాశ్, లేళ్ల అప్పిరెడ్డి, ఆర్కే, సజ్జల ముందస్తు బెయిల్ పిటిషన్లపై రేపు(జూలై 10) విచారణ చేపడతామని కోర్టు తెలిపింది.

Also Read : ఆ భయంతో నిద్రలేని రాత్రులు..! నాడు చక్రం తిప్పిన నాయకులు నేడు ఏమైపోయారు?