జూన్ 9న ప్రమాణస్వీకారం ఉంటుంది.. అందులో ఎలాంటి అనుమానం లేదు : సజ్జల

కౌంటింగ్ జరిగేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. అవతల పార్టీ వాళ్ల ఆటలు సాగనివ్వకుండా జాగ్రత్తగా ఉండాలి.

జూన్ 9న ప్రమాణస్వీకారం ఉంటుంది.. అందులో ఎలాంటి అనుమానం లేదు : సజ్జల

Sajjala Ramakrishna Reddy

Updated On : May 29, 2024 / 2:28 PM IST

Sajjala Ramakrishna Reddy : మళ్లీ అధికారంలోకి వచ్చేది వైసీపీ ప్రభుత్వమే. జూన్ 9న రెండోసారి సీఎంగా జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం ఉంటుంది. అందులో ఎలాంటి అనుమానం లేదని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో కౌంటింగ్ చీఫ్ ఏజెంట్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 175 నియోజకవర్గాల చీఫ్ పోలింగ్ ఏజెంట్లు హాజరయ్యారు. ఈ సమావేశంలో సజ్జల పాల్గొని కౌంటింగ్ ఏజెంట్లకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ రూల్స్ ప్రకారం కౌంటింగ్ సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.

Also Read : తాడిపత్రి పట్టణంలో పోలీసుల హైఅలర్ట్.. ముళ్ల కంచెవేసి బందోబస్తు

కౌంటింగ్ జరిగేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. అవతల పార్టీ వాళ్ల ఆటలు సాగనివ్వకుండా జాగ్రత్తగా ఉండాలి. కచ్చితంగా మళ్లీ మనమే అధికారంలోకి వస్తున్నాం. వైసీపీ ప్రభుత్వం మరోసారి ఏర్పాటవుతుంది. జూన్ 9న ప్రమాణ స్వీకారం ఉంటుంది. అందులో ఎలాంటి అనుమానం లేదని సజ్జల రామకృష్ణా రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Also Reada: Actress Hema : విచారణకు రావాల్సిందే..! మరోసారి నటి హేమకు బెంగళూరు పోలీసుల నోటీసులు

ఇదిలాఉంటే.. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ కు మెయిల్ ద్వారా వైసీపీ రిక్వెస్ట్ పంపించింది. వైసీపీ రాజ్యసభ సభ్యులు నిరంజన్ రెడ్డి ఈ మెయిల్ పంపించారు. పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఈనెల 25న ఇచ్చిన ఆదేశాలు గతంలో ఇచ్చిన వాటికి విరుద్ధంగా ఉన్నాయి. అటెస్టింగ్ ఆఫీసర్ స్పెసిమెన్ సిగ్నేచర్ తీసుకోవడం ఈసీఐ నిబంధనలకు విరుద్ధం. ఈ నిబంధన వల్ల సరైన ఓట్లు కూడా తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. దీనివల్ల ఎన్నికల నిర్వహణ సమగ్రత దెబ్బతింటుంది. తాజా నిబంధనలను అత్యవసరంగా పరిశీలించి ఎప్పటినుంచో అమల్లో ఉన్న ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నాను. ఎన్నికల నిర్వహణలో సమగ్రతను కాపాడేందుకు ఈ విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుతున్నామ‌ని వైసీపీ ఎంపీ పేర్కొన్నారు.