Chandrababu Bail : మద్యం, ఇసుక కేసుల్లో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా

Chandrababu Bail Pleas : పబ్లిక్ సర్వెంట్ గా ఉంటూ చంద్రబాబు అధికార దుర్వినియోగం చేశారని సీఐడీ తరపు లాయర్ వాదించారు. క్యాబినెట్ నిర్ణయానికి విరుద్ధంగా వెళ్ళారుని, దాని వల్ల భారీగా ప్రభుత్వ ఆదాయానికి నష్టం వచ్చిందన్నారు.

Chandrababu Bail : మద్యం, ఇసుక కేసుల్లో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా

Chandrababu

Updated On : November 22, 2023 / 6:33 PM IST

మద్యం, ఇసుక పాలసీ కేసుల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. మద్యం కేసులో విచారణను రేపటికి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. అటు ఇసుక కేసులో బెయిల్ పిటిషన్ పై విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది.

మద్యం కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఇవాళ మధ్యాహ్నం 2గంటల 15 నిమిషాలకు వాదనలు ప్రారంభమయ్యాయి. నిన్న చంద్రబాబు తరపు లాయర్లు వాదనలు వినిపించారు. ఇవాళ సీఐడీ తరపు లాయర్లు వాదనలు వినిపించారు.

మద్యం కేసులో ఎలాంటి అక్రమాలు జరగలేదని నిన్నటి విచారణలో చంద్రబాబు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. సీఐడీ చేసిన అభియోగాలపై ఎలాంటి ఆధారాలు లేవన్నారు. రాజకీయ కక్షతో వరుస కేసులు నమోదు చేస్తున్నారంటూ వాదనలు వినిపించారు చంద్రబాబు తరుపు న్యాయవాది. 17A అమెండ్ మెంట్ యాక్ట్ ఈ కేసుకు వర్తిస్తుందన్నారు.

Also Read : వాలంటీర్లను తొలగించండి- కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ ఫిర్యాదు

కాగా, పబ్లిక్ సర్వెంట్ గా ఉంటూ చంద్రబాబు అధికార దుర్వినియోగం చేశారని సీఐడీ తరపు లాయర్ వాదించారు. క్యాబినెట్ నిర్ణయానికి విరుద్ధంగా వెళ్ళారుని, దాని వల్ల భారీగా ప్రభుత్వ ఆదాయానికి నష్టం వచ్చిందన్నారు. క్యాబినెట్ నిర్ణయం ప్రకారం వెళ్ళాలి లేదా సవరించి ముందుకు వెళ్లాలి.
అలా కాకుండా వెళ్తే అవినీతి స్ప్రెడ్ అవుతుంది. ఎక్సైజ్ పాలసీని 5 నుండి 10 శాతంకు ఉద్దేశ పూర్వకంగా మార్చారు. కొంతమందికే బెనిఫిట్ అయ్యేలా మార్పులు చేసి లైసెన్స్ ఇచ్చారు అని సీఐడీ తరపు న్యాయవాది వాదించారు.

Also Read : చంద్రబాబుకి బెయిల్.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ సీఐడీ, అప్రజాస్వామికం అన్న పొన్నవోలు

స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో అరెస్ట్ అయిన చంద్రబాబు 53 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో జైలు నుంచి బయటకు వచ్చారు. అయితే పలు కేసులు ఆయనను వెంటాడుతున్నాయి. మద్యం, ఇసుక కేసులు నమోదు చేసింది ఏపీ సీఐడీ. ఈ కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లపై విచారణ జరుగుతోంది.