AP High Court : హైకోర్టులో ఉండవల్లి వేసిన స్కిల్ కేసుపై పిటిషన్‌ను వేరే బెంచ్‌కు బదిలీ చేయాలని జడ్జి ఆదేశం

ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన రిట్ పిటీషన్ ను వేరే బెంచ్ కు బదిలిచేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. ‘నాట్ బిఫోర్ మీ’ అంటూ న్యాయమూర్తి ఉండవల్లి అరుణ్ కుమార్ పిటీషన్ ను వేరే బెంచ్ కు బదిలీ చేయాలని ఆదేశించారు.

AP High Court : హైకోర్టులో ఉండవల్లి వేసిన స్కిల్ కేసుపై పిటిషన్‌ను వేరే బెంచ్‌కు బదిలీ చేయాలని జడ్జి ఆదేశం

chandrababu skill development case ..undavalli arun kumar

Updated On : September 27, 2023 / 11:52 AM IST

chandrababu skill development case ..undavalli arun kumar : ఏపీలో స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (skill development case) లో అవినీతి జరిగిందనే ఆరోపణలో అరెస్ట్ అయిన చంద్రబాబు (chandrababu)రాజమండ్రి సెంట్రల్ జైల్లో 19 రోజులుగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ (undavalli arun kumar)హైకోర్టు (Ap high court)లో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఉండవల్లి దాఖలు చేసిన ఈ రిట్ పిటీషన్ పై ఈరోజు విచారణకు వచ్చింది. కానీ ఈ పిటీషన్ ను వేరే బెంచ్ కు బదిలిచేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. ‘నాట్ బిఫోర్ మీ’ అంటూ న్యాయమూర్తి ఉండవల్లి అరుణ్ కుమార్ పిటీషన్ ను వేరే బెంచ్ కు బదిలీ చేయాలని ఆదేశించారు.

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసును సీబీఐ (CBI)కు అప్పగించాలంటూ ఉండవల్లి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంట్లో భాగంగా ఆయన సెప్టెంబర్ 22న ఏపీ హైకోర్టులో రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పిల్ దాఖలు చేశారు. ఈ కేసును ఇప్పటికే ఏపీ సీఐడీ విచారిస్తోంది. కానీ సీఐడీతో కాదు సీబీఐతో విచారణ జరిపించాలి అంటూ ఉండవల్లి హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ పై ఈరోజు అంటే సెప్టెంబర్ 27(2023)న విచారణ జరగాల్సి ఉంది.

Nara bhuvaneswari : చంద్రబాబు విడుదల కోసం చర్చిలో భువనేశ్వరి ప్రార్ధనలు

దీంట్లో భాగంగానే ఈ పిటీషన్ ఈరోజు కోర్టు బెంచ్ ముందుకొచ్చింది. ఈ రోజు కేసుల విచారణ జరపేందుకు వచ్చిన జస్టిస్ రఘునందన్ రావు జడ్జి ఈ పిటిషన్ ను వేరే బెంచ్ కు బదిలీ చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి ‘నాట్ బిఫోర్ మీ’ అని అన్నారు. దీంతో ఈ పిటీషన్ ను ఏ బెంచ్ విచారించాలనే విషయాన్ని హైకోర్టు రిజస్ట్రి నిర్ణయించనున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ పిటీషన్ విచారణ ఎప్పుడు రానుంది అనే విషయం తెలియాల్సి ఉంది.

కాగా ఈ రోజు చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటీషన్లకు సంబంధించి విచారణ జరుగనుంది. మధ్యాహ్నాం 12.00లకు రెండు పిటీషన్లు మీద విచారణ జరుగునుంది. దీని కోసం చంద్రబాబు ఏసీబీ కోర్టుకు చేరుకున్నారు. అలాగే సీఐడీ తరపు లాయర్లు కూడా కోర్టుకు చేరుకున్నారు.

Peddireddy Ramachandrareddy : రిటర్న్ గిప్టు తరువాత ఇద్దువుగానీ ముందు కుప్పంలో గెలిచి చూపించు : మంత్రి పెద్దిరెడ్డి