IRR Case Update : ఇన్న‌ర్ రింగ్ రోడ్డు కేసులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు చేసేందుకు సుప్రీం నిరాకరణ

ఇన్న‌ర్ రింగ్ రోడ్డు కేసులో సుప్రీం కోర్టులో తెలుగు దేశం పార్టీ అధినేత‌ చంద్ర‌బాబు నాయుడికి ఊరట ల‌భించింది.

IRR Case Update : ఇన్న‌ర్ రింగ్ రోడ్డు కేసులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు చేసేందుకు సుప్రీం నిరాకరణ

SC Denies Cancellation Of Chandrababu Bail Petition in IRR Case

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ త‌గిలింది. తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడికి ఊర‌ట ల‌భించింది. ఇన్న‌ర్ రింగ్ రోడ్డు కేసులో చంద్ర‌బాబు ముంద‌స్తు బెయిల్ ను ర‌ద్దు చేసేందుకు దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం నిరాక‌రించింది. 2022లో ఈ కేసుపై ఎస్ఎల్‌పీ దాఖ‌లైంది. అందువ‌ల్ల 17 ఏ నిబంధ‌న వ‌ర్తింస్తుందా..? అని సుప్రీం కోర్టు ప్ర‌శ్నించింది.

ప‌లు సెక్ష‌న్ల కూడా ఈ కేసుపై ఉన్నాయ‌ని, సెక్ష‌న్ 420 కింద కూడా ద‌ర్యాప్తు జ‌రుగుతుంద‌ని న్యాయ‌స్థానం దృష్టికి ఏపీ ప్ర‌భుత్వ త‌రుపున న్యాయ‌వాది తీసుకువెళ్లారు. ఆ సెక్ష‌న్ ఎలా వ‌ర్తిస్తుంద‌ని కోర్టు అడింది. చంద్ర‌బాబుకు సంబంధించి సుప్రీం కోర్టులో ఉన్న ఇత‌ర కేసుల వివ‌రాల‌ను కోరింది. ఆ వివ‌రాల‌ను న్యాయ‌వాది లూథ్రా న్యాయ‌స్థానానికి అంద‌జేశారు. అన్ని వివ‌రాల‌ను ప‌రిశీలించిన న్యాయ‌స్థానం ఏపీ ప్ర‌భుత్వ పిటిష‌న్‌ను కొట్టివేసింది. హైకోర్టు అన్ని అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకునే ఉత్త‌ర్వులు ఇచ్చింద‌ని, కేసు ద‌ర్యాప్తుపై ముంద‌స్తు బెయిల్ ప్ర‌భావం ఉండ‌ద‌న్న సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.

మచిలీపట్నం ఎంపీ వైసీపీ అభ్యర్థిగా అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్

కాగా.. ఇన్న‌ర్ రింగ్ రోడ్ కేసులో చంద్ర‌బాబుకు ఏపీ హైకోర్టు ముంద‌స్తు బెయిల్ మంజూరు చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే.. హైకోర్టు తీర్పును స‌వాల్ చేస్తూ ఏపీ ప్ర‌భుత్వం సుప్రీం కోర్టును ఆశ్ర‌యించింది. సోమ‌వారం ఈ పిటిష‌న్‌పై విచార‌ణ జ‌రుగ‌గా చంద్ర‌బాబు ముంద‌స్తు బెయిల్ ర‌ద్దు చేసేందుకు సుప్రీం కోర్టు నిరాక‌రించింది.