Elections : ఏపీలో ఎన్నికలు.. షెడ్యూల్ విడుదల, 11ఏళ్ల తర్వాత..
ఏపీలో ఎన్నికల నగారా మోగింది. స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. వాస్తవానికి ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసినా

Elections
Elections : ఏపీలో ఎన్నికల నగారా మోగింది. స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. వాస్తవానికి ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసినా, కొన్ని కారణాలతో పలు స్థానిక సంస్థలకు, నెల్లూరు కార్పొరేషన్ కు ఎన్నికలు జరగలేదు. ఈ నేపథ్యంలో నెల్లూరు కార్పొరేషన్, 12 మున్సిపాలిటీలు, 533 పంచాయతీ వార్డులు, 11 జడ్పీటీసీలు, 85 ఎంపీటీసీల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 14, 15, 16 తేదీల్లో ఎన్నికలు జరుపనున్నారు.
Sleep : వయస్సుకు తగ్గ నిద్ర ఆరోగ్యానికి మేలుచేస్తుందా?..
పంచాయతీలకు ఈ నెల 14న పోలింగ్ ఉంటుంది. అదే రోజున ఫలితాలు వెల్లడిస్తారు. నెల్లూరు కార్పొరేషన్ తో పాటు మున్సిపాలిటీలకు ఈ నెల 15న పోలింగ్ జరిపి, 17న ఓట్లు లెక్కిస్తారు. ఇక జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఈ నెల 16న పోలింగ్, ఈ నెల 18న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. ఈ నెల 3 నుంచి 5వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ ఉంటుంది. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో నేటి నుంచి కోడ్ అమల్లోకి రానుంది.
Exercise : క్యాన్సర్ రోగులు వ్యాయామాలు చేయటం మంచిదేనా?..
కడప జిల్లా రాజంపేట మున్సిపల్ ఎన్నికలకు నగారా మోగింది. 11 సంవత్సరాల తర్వాత మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 3వ తేదీ నుండి 5వ తేదీ వరకు ఉదయం 11 నుంచి 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. నవంబర్ 6వ తేదీ నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నవంబర్ 15న ఎన్నికలు నిర్వహిస్తారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 17వ తేదీన ఫలితాలు వెల్లడిస్తారు.