అయ్యో పాపం.. కూలీలుగా మారిన స్కూల్ విద్యార్థులు, ఇసుక మోయలేక ఇబ్బందులు..

శ్రీకాకుళం జిల్లాలో ప్రభుత్వ గురుకుల విద్యార్థులు భనన నిర్మాణ కార్మికులుగా మారారు. బకెట్లలో ఇసుక మోశారు. అయ్యో పాపం.. పిల్లలకు ఇదేం కర్మ. చక్కగా చదువుకోవాల్సిన వయసులో ఇలాంటి పనులు చేయాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది?

అయ్యో పాపం.. కూలీలుగా మారిన స్కూల్ విద్యార్థులు, ఇసుక మోయలేక ఇబ్బందులు..

School Students Labour

School Students Labour : శ్రీకాకుళం జిల్లాలో ప్రభుత్వ గురుకుల విద్యార్థులు భనన నిర్మాణ కార్మికులుగా మారారు. బకెట్లలో ఇసుక మోశారు. అయ్యో పాపం.. పిల్లలకు ఇదేం కర్మ. చక్కగా చదువుకోవాల్సిన వయసులో ఇలాంటి పనులు చేయాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది? అని ఆవేదన చెందుతున్నారా? నిజమే.. వాస్తవానికి వారు కూలీలు కాదు విద్యార్థులే. అయితే, ప్రిన్సిపాల్ ఆదేశంతో వారు లేబర్ అవతారం ఎత్తారు. బకెట్లలో ఇసుకు మోశారు.

స్కూల్ ప్రిన్సిపాల్ విజయనిర్మల.. విద్యార్థులతో నాడు-నేడు పనులు చేయించారు. భామినిలో బాలియోగి బాలికల గురుకుల పాఠశాలలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పాపం పిల్లలు.. బకెట్లలో ఇసుక మోయలేక ఇబ్బందులు పడ్డారు. ప్రిన్సిపాల్ విజయనిర్మల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పిల్లలకు విద్యాబుద్దులు చెప్పి, టీచర్లు తప్పు చేస్తే సరిదిద్దాల్సిన ప్రిన్సిపాలే..ఇలా దారితప్పితే ఎలా అని అడుగుతున్నారు. ఆ ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను డిమాండ్ చేశారు.