CBI Investigation: వైఎస్ వివేకా హత్యకేసులో రెండవ రోజు సీబీఐ విచారణ

డప జిల్లాలో రెండవ రోజు(08 జూన్ 2021) మాజీమంత్రి, ముఖ్యమంత్రి బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతుంది. నిన్నటి నుంచి విచారణ ప్రారంభించిన సీబీఐ అధికారులు.. వివేకా కంప్యూటర్ ఆపరేటర్ ఇనాయతుల్లాను ఈరోజు విచారిస్తున్నారు.

CBI Investigation: వైఎస్ వివేకా హత్యకేసులో రెండవ రోజు సీబీఐ విచారణ

Second Day Of Cbi Investigation Started In Ys Viveka Murder Case

Updated On : June 8, 2021 / 11:50 AM IST

Ys Viveka Murder Case: కడప జిల్లాలో రెండవ రోజు(08 జూన్ 2021) మాజీమంత్రి, ముఖ్యమంత్రి బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతుంది. నిన్నటి నుంచి విచారణ ప్రారంభించిన సీబీఐ అధికారులు.. వివేకా కంప్యూటర్ ఆపరేటర్ ఇనాయతుల్లాను ఈరోజు విచారిస్తున్నారు. ఒక్కోక్కరిని ఏడు గంటల పాటు విచారిస్తున్నారు సీబీఐ అధికారులు.

డ్రైవర్ దస్తగిరిని విచారించిన సీబీఐ బృందం రెండోరోజు కూడా డ్రైవర్‌ను విచారించనుంది. విచారణకు హాజరుకావాలని కీలక వ్యక్తులకు, అనుమానితులకు ఇప్పటికే నోటీసులు జారీ చేసింది సీబీఐ. కేసుకు సంబంధించిన వివరాలను గోప్యంగా ఉంచి విచారిస్తున్నారు సీబీఐ అధికారులు.

వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో పలువురిని రెండేళ్ల క్రితం విచారించిన సీబీఐ.. గతేడాది కొందరిని విచారించింది. విచారణకు వచ్చిన అధికారులలో కొందరికి కరోనా రావడంతో విచారణ నిలిచిపోయింది. ఏడు నెలల తరువాత మళ్లీ విచారిస్తున్నారు అధికారులు. ఇదివరకే ప్రశ్నించిన వ్యక్తులకు నోటీసులు ఇస్తున్నారు.

Read:ప్ర‌ధాని మోదీకి ఏపీ సీఎం జ‌గ‌న్ లేఖ‌