Seethanagaram Rape Case : తాడేపల్లి పోలీస్ స్టేషన్‌కు సీతానగరం అత్యాచార బాధితురాలు, మరోసారి స్టేట్ మెంట్ రికార్డ్
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన గుంటూరు జిల్లా సీతానగరం సామూహిక అత్యాచార కేసు బాధితురాలు తాడేపల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు.

Seethanagaram Rape Case
Seethanagaram Rape Case : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన గుంటూరు జిల్లా సీతానగరం సామూహిక అత్యాచార కేసు బాధితురాలు తాడేపల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. అసలేం జరిగింది అనే విషయంపై మరోసారి ఆమె స్టేట్ మెంట్ ను పోలీసులు రికార్డ్ చేస్తున్నారు. మొదట ఎవరు వచ్చారు? అసలు ఎంతమంది వచ్చారు? అనే అంశాలపై పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. మరోసారి గంజాయి, బ్లేడ్ బ్యాచుల సభ్యుల ఫొటోలను బాధితురాలికి చూపించే అవకాశం ఉంది. ఈ కేసులో ప్రధాని నిందితుడిని పోలీసులు సమగ్రంగా విచారిస్తున్నారు.
ఈ కేసులో నిందితులను గుర్తించామని హోంమంత్రి సుచరిత తెలిపారు. దర్యాఫ్తు పూర్తి కాగానే వివరాలు వెల్లడిస్తామన్నారు. నిందితుల వివరాలు ముందుగానే చెబితే వారు తప్పించుకునే అవకాశం ఉందన్నారు. దర్యాఫ్తు ముగిశాక నిందితులను పోలీసులు మీడియాకు ముందుకు తీసుకొస్తారని హోంమంత్రి తెలిపారు.