తిరుమల శ్రీవారి ఆలయంలో శాంతిహోమం.. ఎప్పుడు నిర్వహిస్తారు, ఎలా చేస్తారు.. పూర్తి వివరాలు..

స్వామి వారికి నివేదించే నైవేద్యాలు, ప్రసాదాల తయారీకి వాడే నెయ్యి కల్తీ అయిందని, యానిమల్ ఫ్యాట్ కలిసి అపవిత్రం అయిందని నివేదికలు వచ్చాయి. దీంతో దానికి ప్రాయశ్చిత్తంగా..

తిరుమల శ్రీవారి ఆలయంలో శాంతిహోమం.. ఎప్పుడు నిర్వహిస్తారు, ఎలా చేస్తారు.. పూర్తి వివరాలు..

Tirumala Shanthi Homam (Photo Credit : Google)

Updated On : September 22, 2024 / 5:25 PM IST

Tirumala Shanthi Homam : తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం శాంతి హోమం నిర్వహించనున్నారు. ఇందుకు టీటీడీ రెడీ అయ్యింది. శ్రీవారి ప్రసాదాల తయారీలో వాడే నెయ్యిలో ఆనిమల్ ఫ్యాట్ కలిసిందనే దానికి ప్రాయశ్చిత్తంగా ఈ శాంతి హోమం నిర్వహిస్తోంది టీటీడీ. సోమవారం ఉదయం ఆలయంలోని యాగశాలలో ఉదయం 6 గంటల నుంచి శాంతి హోమం జరుపుతారని సమాచారం. నిత్యం శ్రీవారి ఆలయంలో జరిగే ఆర్జిత సేవలకు ఆటంకం కలగకుండా ఈ హోమం జరిపిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం.

శ్రీవారి ఆలయంలోని యాగశాలలో హోమం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్వామి వారికి నివేదించే నైవేద్యాలు, ప్రసాదాల తయారీకి వాడే నెయ్యి కల్తీ అయిందని, యానిమల్ ఫ్యాట్ కలిసి అపవిత్రం అయిందని నివేదికలు వచ్చాయి. దీంతో దానికి ప్రాయశ్చిత్తంగా శ్రీవారి ఆలయంలో 3 గంటల పాటు శాంతి హోమం నిర్వహిస్తారు. యాగశాలలో ఈ కార్యక్రమం ఉంటుంది. జరిగిన తప్పిదానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నారు. రేపు రోహిణి నక్షత్రం కూడా కావడంతో శ్రీవారికి ముహూర్త బలం. దీంతో శాంతి హోమం నిర్వహించాలని అర్చకులు నిర్ణయించినట్లు సమాచారం. ముందుగా మహాశాంతి యాగం, వాస్తు హోమం నిర్వహిస్తారు. చివరగా పంచద్రవ్యాలతో సంప్రోక్షణ చేయనున్నారు.

Also Read : మీరు మారరా? మాజీ సీఎం జగన్‌కు కేతిరెడ్డి ఇచ్చిన సలహా వైసీపీలో ఫైర్‌..!

అదే సమయంలో శ్రీవారికి జరిగే ఆర్జిత సేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఒక్కరోజు మాత్రమే యాగం నిర్వహించేందుకు టీటీడీ నిర్ణయం తీసుకుంది. దాదాపు 3 రోజుల పాటు శాంతి హోమం చేయాలని తొలుత అనుకున్నారు. అయితే, ఆర్జిత సేవలకు ఆటంకం లేకుండా ఒక్కరోజు మాత్రమే అది కూడా 3 గంటల పాటు మాత్రమే ఆలయంలోని యాగశాలలో హోమం నిర్వహిస్తున్నారు. శ్రీవారి ఆలయం నిత్యం రద్దీగా ఉంటుంది. రోజూ దాదాపుగా 80వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటుంటారు. రద్దీ రోజుల్లో భక్తుల సంఖ్య 90 వేల నుంచి 95వేలుగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో మూడు రోజుల పాటు హోమం చేసే అవకాశం లేకపోవడంతో ఒక్కరోజే శాంతిహోమం నిర్వహించేందుకు టీటీడీ డెసిషన్ తీసుకుంది.