YS Sharmila: ప్రధాని నరేంద్ర మోదీకి షర్మిల లేఖ.. ఆ వాగ్దానాలు నెరవేర్చాలని డిమాండ్

విభజన జరిగిన దశాబ్దం తర్వాత కూడా ఏపీకి రాజధాని నగరం లేకుండా చేశారని లేఖలో వైఎస్ షర్మిల పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి

YS Sharmila: ప్రధాని నరేంద్ర మోదీకి షర్మిల లేఖ.. ఆ వాగ్దానాలు నెరవేర్చాలని డిమాండ్

YS Sharmila

Sharmila Letter To PM Modi : ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దూకుడు పెంచారు. మరికొద్ది నెలల్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార వైసీపీతోపాటు, ప్రతిపక్ష టీడీపీ, బీజేపీలపై విమర్శల దాడిని తీవ్రతరం చేశారు. తాజాగా.. ఏపీకి సంబంధించిన పలు అంశాలను ప్రస్తావిస్తూ, వాటిని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి షర్మిల లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లో పేర్కొన్న అపరిష్కృత వాగ్దానాలపై మీ దృష్టికి తీసుకువస్తున్నానంటూ లేఖలో షర్మిల పేర్కొన్నారు.

Also Read : Family Pension : మ‌హిళా ప్ర‌భుత్వ ఉద్యోగులు భ‌ర్త‌కు కాకుండా పింఛ‌న్ పిల్ల‌ల‌కే వ‌చ్చేలా చేయొచ్చు

విభజన జరిగిన దశాబ్దం తర్వాత కూడా ఏపీకి రాజధాని నగరం లేకుండా చేశారని లేఖలో వైఎస్ షర్మిల పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నికల ప్రచార సమయంలో చేసిన అదనపు వాగ్దానాలతో సహా ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం హామీలను నెరవేర్చడంపై అంచనాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే, పదేళ్లు కావస్తున్నా నేటికీ ఒక్క హామీ కూడా నెరవేరలేదని షర్మిల పేర్కొన్నారు. ఫలితంగా నేడు రాష్ట్రం గందరగోళం, నిస్సహాయత పరిస్థితుల్లో ఉందని, ఇందుకు ఒక స్పష్టమైన ఉదాహరణ ప్రత్యేక హోదా అని షర్మిల అన్నారు

Also Read : బాలినేనిపై సీఎం జగన్ సీరియస్..!

ప్రత్యేక హోదా అనేది వివిధ రంగాల్లో రాష్ట్ర ప్రమాణాలను మెరుగుపరచడం, తద్వారా ఇతర రాష్ట్రాలకు పోటీగా రాష్ట్రం అభివృద్ధి సాధించే అవకాశం ఉండేది. ఇది జరగలేదు. ప్రభుత్వం ఈ డిమాండ్ ను పూర్తిగా విస్మరించిందని షర్మిల పేర్కొన్నారు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన వాగ్దానాలు చాలా ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రాజెక్టు జాతీయ హోదాను నీరుగార్చేశాయి. ఫలితంగా నేడు పోలవరం ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని షర్మిల అన్నారు. ప్రభుత్వాలుకూడా ప్రాజెక్టు వ్యయాన్ని తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయని తెలుస్తోంది. ఇదేజరిగితే ప్రాజెక్టు లక్ష్యాన్ని నాశనం చేసినట్లేనని ప్రధానికి రాసిన లేఖలో షర్మిల పేర్కొన్నారు. ఈ అంశాలను 5.5కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున తాము విజ్ఞప్తిని చేస్తున్నామని, ఈ విషయాలను సీరియస్ గా పరిగణలోకి తీసుకొని ఈ వాగ్దాలను నెరవేర్చాలని షర్మిల లేఖలో పేర్కొన్నారు.

మరోవైపు రాష్ట్రానికే గర్వకారణంగా, నగరానికి ప్రతీకగా నిలిచిన వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలన్న మీ ప్రభుత్వ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని విజ్ఞప్తి చేస్తున్నామని షర్మిల లేఖలో పేర్కొన్నారు. సుదీర్ఘ పోరాటం ఫలితంగా ఉక్కు కర్మాగారం ఏర్పడింది, దానికోసం అనేక మంది ప్రాణాలు అర్పించారు. మీరు ఈ విషయాన్ని సీరియస్‌గా పరిగణించి, ఈ వాగ్దానాలను నెరవేర్చడానికి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆశాజనకంగా, పురోగతిని అందించడానికి ఖచ్చితమైన చర్యలను ప్రారంభిస్తారని ఆశిస్తున్నామని ప్రధానికి రాసిన లేఖలో షర్మిల పేర్కొన్నారు.