Raja Anirudh Sriram : చిచ్చరపిడుగు.. ఆరేళ్లకే ‘మైక్రోసాఫ్ట్ ఆఫీసు’ స్పెషలిస్టు అయ్యాడు!

వయస్సు చూస్తే ఆరేళ్లు.. చదివేది రెండో తరగతి.. కానీ, మైక్రోసాఫ్ట్ స్పెషలిస్టు పరీక్ష పాసై అందరిని అబ్బురపరిచాడు.. ఆ చిచ్చరపిడుగే రాజా అనిరుధ్ శ్రీరామ్..

Raja Anirudh Sriram : చిచ్చరపిడుగు.. ఆరేళ్లకే ‘మైక్రోసాఫ్ట్ ఆఫీసు’ స్పెషలిస్టు అయ్యాడు!

Six Year Old From Tirupati Becomes ‘microsoft Office Specialist’

Updated On : August 30, 2021 / 9:47 AM IST

Raja Anirudh Sriram : వయస్సు చూస్తే ఆరేళ్లు.. చదివేది రెండో తరగతి.. కానీ, మైక్రోసాఫ్ట్ స్పెషలిస్టు పరీక్ష పాసై అందరిని అబ్బురపరిచాడు.. ఆ చిచ్చరపిడుగే రాజా అనిరుధ్ శ్రీరామ్.. ఐటీ ప్రొఫెషనల్స్ కు కూడా కష్టమైన పరీక్షలో విజయం సాధించాడు. ఆరేళ్ల ప్రాయంలోనే కంప్యూటర్ పరిజ్ఞానంతో మిలియన్లలో ఒకడిగా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎక్కాడు. తిరుపతికి చెందిన తల్లిదండ్రులు సాకేత్ రామ్, అంజనా శ్రావణిల కుమారుడే అనిరుధ్.. Edify స్కూల్లో చదువుతున్నాడు. ఒకవైపు ఆన్ లైన్ కాసులు వింటూనే మరోవైపు కంప్యూటర్ ముందు కూర్చొని మైక్రోసాఫ్ట్ ఎక్స్ ఎల్ ప్రాక్టీస్ చేశాడు.

కరోనా సమయంలో స్కూల్ కు వెళ్లే పరిస్థితి లేదు. అంతా ఆన్ లైన్ లోనే క్లాసులు.. ఇదే సమయాన్ని అనిరుధ్ సద్వినియోగపరుచుకున్నాడు. అందరి పిల్లల్లా ఆడుకోకుండా కంప్యూటర్ ఎక్స్ ఎల్ ఓపెన్ చేసి.. A, B, C, D అని టైప్ చేయడం మొదలుపెట్టాడు. బాలుడి ఆసక్తిని గుర్తించిన తల్లిదండ్రులు అతడికి మైక్రోసాఫ్ట్ ఎక్స్ ఎల్‌లో మెలకువలను నేర్పించారు. ఇంక అంతే.. సూపర్ ఫాస్ట్ గా అన్ని నేర్చేసుకున్నాడు. ఏకంగా మైక్రోసాఫ్ట్ ఆఫీసు స్పెషలిస్టు పరీక్షకు రెడీ అయ్యాడు.
Texas Mom : బడికి పంపుతున్నా..క్షమించండి అంటూ పిల్లలకు తల్లి లేఖ

మొదటి ప్రయత్నంలో ఆగస్టు 14న టెస్టు రాశాడు. అందులో విజయం సాధించలేకపోయాడు. అయినా బాధపడలేదు. మళ్లీ ప్రయత్నించాడు.. నిరంతర సాధనతో మంచి స్కోరు సాధించాడు. ఈ క్రమంలో అతడి స్కోరు 1000కి 546 నుంచి 950కి మెరుగుపడింది. రెండో ప్రయత్నంగా ఆగస్టు 21న మళ్లీ టెస్టు రాసి అందులో పాసయ్యాడు. మైక్రోసాఫ్ట్ ఆఫీసు స్పెషలిస్ట్ సర్టిఫికేట్ పొందాడు. తద్వారా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకున్నాడు. ఆరేళ్లకే ఈ రికార్డు సాధించిన అనిరుధ్.. ఒడిశాకు చెందిన ఏడేళ్ల బాలుడి రికార్డును బ్రేక్ చేశాడు.
RRR : నగర విధుల్లో సందడి చేసిన “ఆర్ఆర్ఆర్” బ్యూటీ