ఆంధ్రప్రదేశ్‌కు వర్ష సూచన.. ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..
ముఖ్యంగా ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.

AP Rain
నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వాతావరణం మారిపోయింది. రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ప్రస్తుతం ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాల్లో వర్షాల ప్రభావం కనిపించే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రకాశం, బాపట్ల, పల్నాడు, తూర్పు గోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లాల వాసులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.
Also Read: గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటన.. బాధిత కుటుంబ సభ్యుల ఆరోపణలకు ఫైర్ డిపార్ట్మెంట్ కౌంటర్
ఈ నేపథ్యంలో కోస్తాంధ్ర తీరానికి అనుకుని సముద్ర ఉపరితలంపై బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు. ఈ గాలుల వేగం గంటకు 35 నుంచి 45 కిలోమీటర్లు, గరిష్ఠంగా 55 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉంది.
ఈ పరిస్థితుల దృష్ట్యా మత్స్యకారులు మూడు రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. వర్షాలు, గాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నందున స్థానిక అధికారులు, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.