SBI Gold Gol Mall Case : శ్రీకాకుళం జిల్లా గార ఎస్బీఐ గోల్డ్ గోల్ మాల్ కేసు.. ఏడుగురు అరెస్ట్, 7 కేజీలకు పైగా బంగారం స్వాధీనం

లోహిత కన్సేల్టిన్సీ తిరుమలరావు స్వప్నప్రియతో పరిచయం పెంచుకుని గోల్డ్ ని మళ్లించారని తెలిపారు. సిట్ ను ఏర్పాటు చేసి రెండు బృందాలతో దర్యాప్తు చేశామని వెల్లడించారు.

SBI Gold Gol Mall Case : శ్రీకాకుళం జిల్లా గార ఎస్బీఐ గోల్డ్ గోల్ మాల్ కేసు.. ఏడుగురు అరెస్ట్, 7 కేజీలకు పైగా బంగారం స్వాధీనం

SBI Gold Gol Mall case

Gara SBI Gold Gol Mall Case : శ్రీకాకుళం జిల్లా గార ఎస్బీఐ గోల్డ్ గోల్ మాల్ కేసుని పోలీసులు చేధించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను శ్రీకాకుళం జిల్లా ఎస్పీ జి.ఆర్ రాధిక మీడియాకు వివరించారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. ఉరిటి స్వప్న ప్రయ, సురేష్, ఉద్యోగులు, మరో ఆరుగురు గోల్డ్ గోల్ మాల్ లో ఉన్నారని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ జి.ఆర్ రాధిక తెలిపారు. 86 బ్యాగ్ లు మాయమయ్యాయని తేలిందన్నారు. 26 బ్యాగ్ లు ఉద్యోగులు వెనక్కి ఇచ్చారని వెల్లడించారు.

లోహిత కన్సేల్టిన్సీ తిరుమలరావు స్వప్నప్రియతో పరిచయం పెంచుకుని గోల్డ్ ని మళ్లించారని తెలిపారు. సిట్ ను ఏర్పాటు చేసి రెండు బృందాలతో దర్యాప్తు చేశామని వెల్లడించారు. లోహిత కన్సేల్టేన్సీ తిరుమలరావును అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. బ్యాంక్ ఉద్యోగి సురేష్ పరారీలో ఉన్నారని చెప్పారు. సంవత్సర కాలంగా గోల్డ్ ని బయటికి మళ్లించి.. ప్రైవేట్ బ్యాంక్ లలో తాకట్టు పెట్టేవారని వెల్లడించారు.

Jeevan Reddy : 3రోజుల్లో 7కోట్లు చెల్లించాలి.. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఆర్టీసీ డెడ్‌లైన్

సీఎస్బీ, ఫెడరల్ బ్యాంక్ లో బినామి పేరుతో నిందితులు తాకట్టు పెట్టారని తెలిపారు. డిప్యూటి మేనేజర్ స్వప్న ప్రియ, సోదరుడు కిరణ్.. వచ్చిన డబ్బులతో రియల్ఎస్టేట్ లో డబ్బులు పెట్టేవారని వివరించారు. డిప్యూటీ మేనేజర్ స్వప్నప్రియ ఆత్మహత్య చేసుకుని చనిపోయారని స్పష్టం చేశారు.

సీఎస్బీ, ఫెడరల్ బ్యాంక్ అధికారులు సహా ఏడుగురుని అరెస్ట్ చేశామని తెలిపారు. బ్యాంక్ ఉద్యోగి సురేష్ కోసం గాలిస్తున్నామని పేర్కొన్నారు. బ్యాంక్ లో మాయమైన 7 కేజీల 195 గ్రాముల గోల్డ్ ను పూర్తిగా రికవరీ చేశామని పేర్కొన్నారు.