Srisailam : శ్రీశైలం మల్లన్న హుండీ లెక్కింపు.. 28 రోజులకు రూ.3.43 కోట్ల ఆదాయం

ఈ హుండి లెక్కింపులో బంగారం 172 గ్రాముల 400 మిల్లీగ్రాములు, వెండి 10 కేజీల 350 గ్రాములు లభించాయి. హుండీ లెక్కింపులో ఆలయ ఉద్యోగులు, శివసేవకులు, భక్తులు పాల్గొన్నారు.

Srisailam : శ్రీశైలం మల్లన్న హుండీ లెక్కింపు.. 28 రోజులకు రూ.3.43 కోట్ల ఆదాయం

Srisailam Mallanna Hundi

Srisailam Mallanna Hundi : నంద్యాల జిల్లాలోని శ్రీశైలం మల్లన్న హుండీ ఆదాయాన్ని లెక్కించారు. హుండీ లెక్కింపులో 28 రోజులకు గాను రాబడి 3 కోట్ల 43 లక్షల 68 వేల 91 రూపాయలు కానుకల రూపంలో భక్తులు సమర్పించారు. ఈ హుండి లెక్కింపులో బంగారం 172 గ్రాముల 400 మిల్లీగ్రాములు, వెండి 10 కేజీల 350 గ్రాములు లభించాయి. హుండీ లెక్కింపులో ఆలయ ఉద్యోగులు, శివసేవకులు, భక్తులు పాల్గొన్నారు.

మరోవైపు శ్రావణ మాసం సందర్భంగా శ్రీశైలంలో ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 15 వరకు శ్రావణ
మాసోత్సవాలు నిర్వహించనున్నారు.శ్రావణ మాసం సందర్భంగా శ్రీశైలంకు వచ్చే భక్తులు రద్దీకి అనుగుణంగా దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో దేవస్థానం ఈవో లవన్న గురువారం పాతాళ గంగ, కళ్యాణ కట్ట, డార్మెటరీలు, పాతాళేశ్వర సదన్, మళ్లి కార్జున సదన్, గంగా -గౌరి సదన్ ల వద్ద వసతి ఏర్పాట్లను పరిశీలించారు.

TSRTC: శ్రీశైలం వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక టూర్‌ ప్యాకేజీ.. స్పెషల్ బస్సులు

వివిధ విభాగాల అధికారులతో కలిసి ఈవో లవన్న మొదట పాతాళ గంగ మెట్ల మార్గంలో కాలినడకన వెళ్లి అక్కడ ఏర్పాట్లను పరిశీలించి ఆదేశాలు జారీ చేశారు. వేకువ జాము నుంచే భక్తులు పాతాళ గంగలో పుణ్య స్నానాలు ఆచరిస్తారని తెలిపారు. కాబట్టి మెట్ల మార్గంలో తగినంత లైటింగ్ వసతులు కల్పించాలని, మెట్ల మార్గం రైలింగ్ పెయింటింగ్ వేయాలని ఆదేశించారు.