One Year Rule Celebrations: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. రాష్ట్ర స్థాయి వేడుకగా కూటమి ప్రభుత్వం ఏడాది పాలన..
వచ్చే నాలుగేళ్ల పాలనా కాలానికి సంబంధించి ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులకు దిశా నిర్దేశం చేశారు చంద్రబాబు.

Pawan and chandrababu
One Year Rule Celebrations: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
కూటమి సర్కార్ ఏడాది పాలనను రాష్ట్ర స్థాయి వేడుకగా నిర్వహించాలని డిసైడ్ అయ్యింది. సుపరిపాలన- స్వర్ణాంధ్రప్రదేశ్ పేరుతో రాష్ట్ర స్థాయి వేడుకలు నిర్వహించనున్నారు. జూన్ 12న సాయంత్రం ఈ వేడుకలను అమరావతిలో నిర్వహించనున్నారు. ఈ మేరకు సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఆల్ ఇండియా ఆఫీసర్లతో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు తగిన ఏర్పాట్లు చేయాలని చెప్పారు.
వేడుకలు జరిపే చోటే ఎన్డీయే భారీ బహిరంగ సభని ఏర్పాటు చేయనుంది. ఈ బహిరంగ సభలో ఎంపీలు, ఎమ్మెల్యేలు అంతా పాల్గొనాలన్న సీఎం చంద్రబాబు.. ఏడాది పాలనలో ప్రభుత్వ అమలు చేసిన అభివృద్ధి పథకాలపై ప్రజలకు వివరించాలన్నారు. అలాగే వచ్చే నాలుగేళ్ల పాలనా కాలానికి సంబంధించి ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులకు దిశా నిర్దేశం చేశారు చంద్రబాబు. ఎమ్మెల్యేలు, ఎంపీలతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేశారు.
సుపరిపాలన- స్వర్ణాంధ్రప్రదేశ్ పేరుతో ఈ నెల 12న వేడుకలు నిర్వహించడంతో పాటు భారీ బహిరంగ సభ నిర్వహించనుంది కూటమి ప్రభుత్వం. ఈ నెల 12వ తేదీకి కూటమి సర్కార్ వచ్చి ఏడాది అవుతుంది. దీన్ని పురస్కరించుకుని భారీ ఎత్తున విజయోత్సవాలు చేయాలని కూటమి నాయకత్వం నిర్ణయించింది. కూటమి అధిపతిగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు దీన్ని లీడ్ చేస్తున్నారు.
Also Read: వైఎస్ బిడ్డ అని, ఒక మహిళ అని కూడా చూడకుండా నన్ను కించపరిచారు- వైఎస్ షర్మిల
ఇప్పటికే కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా నియోజకవర్గాల్లో విజయోత్సవ ర్యాలీలు నిర్వహించాలని, ఏడాది పాలనలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలను ప్రజలకు వివరించాలని చెప్పారు. అలాగే రాబోయే నాలుగేళ్లలో చేయబోయే కార్యక్రమాల గురించి కూడా ప్రజలకు వివరించాలని దిశానిర్దేశం చేశారు. అలాగే ప్రజలకు ముఖ్యమైన సమస్యలన్నీ అడ్రస్ చేయాల్సి అవసరం ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
అదే సమయంలో శ్రుతి మించి వ్యవహరిస్తున్న కొందరు ఎమ్మెల్యేలకు స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చారు చంద్రబాబు. సుపరిపాలన-స్వర్ణాంధ్రప్రదేశ్ పేరుతో అమరావతిలో అసెంబ్లీ వెనుక వైపున్న (నరేంద్ర మోదీ బహిరంగ నిర్వహించిన చోటు) ప్రాంతంలో కీలకమైన సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికార యంత్రాంగం మొత్తం హాజరవబోతోంది. ఏడాదిలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, లోటుపాట్లపై చర్చించనున్నారు. రాబోయే నాలుగేళ్లు చేయాల్సిన కార్యక్రమాల గురించి రోడ్ మ్యాప్ డిసైడ్ చేయబోతున్నారు.