Ys Sharmila: వైఎస్ బిడ్డ అని, ఒక మహిళ అని కూడా చూడకుండా నన్ను కించపరిచారు- వైఎస్ షర్మిల

జగన్.. నా అక్క చెల్లెళ్ళు అంటాడు. జగన్ సొంత చెల్లికి మర్యాద లేదు. ఇక రాష్ట్రంలో మహిళలకు ఏం గౌరవం ఇస్తారు?

Ys Sharmila: వైఎస్ బిడ్డ అని, ఒక మహిళ అని కూడా చూడకుండా నన్ను కించపరిచారు- వైఎస్ షర్మిల

ys sharmila

Updated On : June 10, 2025 / 5:27 PM IST

Ys Sharmila: మహిళల మీద సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఖండించారు. సజ్జల మూర్ఖుడిలా మాట్లాడుతున్నారని ఆమె మండిపడ్డారు. మహిళలను పిశాచులతో పోల్చుతారా? అని ధ్వజమెత్తారు. మహిళలను రాక్షసులు అంటారా? సంకర జాతి అని అవమానిస్తారా? చేసిన తప్పుకి క్షమాపణ చెప్పడానికి మీకు ఎందుకు నామోషీ? అంటూ సజ్జలపై ఫైర్ అయ్యారు షర్మిల. వైసీపీ చేసిన తప్పు మళ్ళీ మళ్ళీ చేస్తోందని షర్మిల అన్నారు. ఇదే సజ్జల కొడుకు సోషల్ మీడియాను అడ్డు పెట్టుకొని నన్ను కూడా వదిలి పెట్టలేదని షర్మిల వాపోయారు.

”సైతాన్ సైన్యంతో నా మీద తప్పుడు ప్రచారం చేయించారు. వైఎస్ బిడ్డ అని, ఒక మహిళ అని కూడా చూడకుండా కించపరిచారు. జగన్.. నా అక్క చెల్లెళ్ళు అంటాడు. జగన్ సొంత చెల్లికి మర్యాద లేదు. ఇక రాష్ట్రంలో వీళ్ళు మహిళలకు ఏం గౌరవం ఇస్తారు? కాంగ్రెస్ పార్టీ మహా సముద్రం. సముద్రంలో మంచితో పాటు చెత్త కూడా ఉంటుంది. అప్పుడప్పుడు చెత్త పైకి వస్తుంది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారు. పార్టీకి క్రమశిక్షణ కమిటీ ఉంది. అటువంటి వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం. పార్టీపై దుష్ప్రచారం చేస్తే ఊరుకునేది లేదు” అని హెచ్చరించారు షర్మిల.

Also Read: ఇకపై చేరికలకు షరతులు.. టీడీపీ న్యూ రూల్స్..! జాయినింగ్స్‌పై అధిష్ఠానం ఆలోచన ఏంటి?