సీఎం జగన్‌పై దాడి కేసు.. పోలీసుల పిటిషన్‌పై వాదనలు

జగన్ పై దాడి కేసులో సతీశ్ ఏ1గా ఉన్నాడు. ఇప్పటికే 164 స్టేట్మెంట్ కోసం పిటిషన్ వేశారు పోలీసులు.

సీఎం జగన్‌పై దాడి కేసు.. పోలీసుల పిటిషన్‌పై వాదనలు

Stone pelting case

విజయవాడలో వైసీపీ నిర్వహించిన రోడ్‌ షోలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పై రాయితో జరిగిన దాడి కేసులో సతీశ్ అనే వ్యక్తిని పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అతడిని కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.

ఏడు రోజుల కస్టడీ కోరుతూ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్, మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ వేశారు. జగన్ పై దాడి కేసులో సతీశ్ ఏ1గా ఉన్నాడు. ఇప్పటికే 164 స్టేట్మెంట్ కోసం పిటిషన్ వేశారు పోలీసులు. ఇప్పుడు మరింత విచారించాల్సి ఉందంటూ కస్టడీకి కోరుతున్నారు.

ప్రస్తుతం విజయవాడ సబ్ జైల్ లో సతీశ్ రిమాండ్ లో ఉన్నాడు. పోలీస్ కష్టడికి అతడిని అప్పగించడంపై మంగళవారం కూడా వాదనలు జరగనున్నాయి. నిందితుడి స్టేట్మెంట్ ను రికార్డు చేయాలని పీపీ అన్నారు. ఏప్రిల్ 29 వరకు స్టేట్మెంట్ రికార్డ్ చేయవద్దంటూ నిందితుడి తరుఫు న్యాయవాది వాదించారు. ఇరువైపుల న్యాయవాదుల వాదనలు విన్న జడ్జి.. ఈ నెల 29 తరువాత నిందితుడి స్టేట్మెంట్ ను రికార్డ్ చేస్తామని తెలిపారు. ఈ కేసు 29కి వాయిదా పడింది.

Also Read: ఢిల్లీ లిక్కర్ స్కామ్.. కవిత పిటిషన్‌పై వాదనలు ఎలా జరిగాయో తెలుసా?