East Godavari : ఆ గ్రామంలో ఏం జరుగుతోంది ? ఆగని మరణాలు
తూర్పు గోదావరి జిల్లాలోని పులిపాక గ్రామ ప్రజలు వణికిపోతున్నారు. అసలు ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.

Ap East Godavari
Strange Disease Spread Pulipaka : తూర్పు గోదావరి జిల్లాలోని పులిపాక గ్రామ ప్రజలు వణికిపోతున్నారు. అసలు ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. వరుసగా మరణాలు సంభవిస్తున్నాయి. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా ప్రాణాలు విడుస్తున్నారు. అసలు ఏ వ్యాధితో చనిపోతున్నారు ? అనేది అంతుచిక్కడం లేదు. వింత వ్యాధిపై మృత్యువాత పడుతున్న గ్రామంపై 10tv వరుస కథనాల ప్రసారం చేసింది. వామ్మో..బతికి ఉంటే..బలుసాకు తినొచ్చు..గ్రామాన్ని విడిచిపోవాలని చాలా కుటుంబాలు అనుకుంటున్నట్లు సమాచారం.
Read More: Vitamin D : విటమిన్ డి కోసం ఎండలో ఎంత సేపు ఉండాలంటే?..
వివరాల్లోకి వెళితే…
తూర్పు గోదావరి జిల్లాలో..పులిపాక గ్రామం ఉంది. ఈ గ్రామంలో వింత వ్యాధి కలకలం రేపుతోంది. గత కొన్ని రోజులుగా చాలా మంది చనిపోతున్నారు. తాజాగా…మృతుల సంఖ్య 10కి చేరింది. అయినా..అధికారులు స్పందించడం లేదని వాపోతున్నారు గ్రామస్థులు. ఇప్పటి వరకు హెల్త్ ఎమర్జెన్సీ కూడా ప్రకటించడంలేదని వారు వాపోతున్నారు. తమ గ్రామంపై అధికారులు నిర్లక్ష్యం వ్యహిస్తున్నారని, చిన్నా..పెద్దా అనే తేడా లేకుండా…గ్రామంలో మృత్యువాత పడుతున్నారని పోలిపాక గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో గ్రామం నుంచి వెళ్లిపోవాలని పలువురు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
Read More: TN’s Karur : వ్యాక్సిన్ వేయించుకుంటే..వాషింగ్ మెషిన్, గ్రైండర్, వెట్ గ్రైండర్ గిఫ్ట్స్
మరోవైపు వింత వ్యాధి గురించి 10tvలో వరుస కథనాలు ప్రసారమయ్యాయి. వింత మరణాలపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని 10tvని వేడుకుంటున్నారు. కథనాలపై చింతూరు ఐటీడీఏ పీఓ ఆకుల వెంకటరమణ చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే…పై స్థాయి అధికారులు స్పందించకున్నా…క్షేత్రస్థాయిలో వైద్య సహాయం అందడం లేదని ఆవేదన చెందుతున్నారు. మరి వింత వ్యాధిపై ఉన్నతాధికారులు స్పందిస్తారా ? లేదా ? అనేది చూడాలి.