Weather Forecast: వామ్మో.. ఎండలు బాబోయ్‌ ఎండలు.. మరో 3 రోజులు వాతావరణం ఎలా ఉండనుందో తెలుసా?

అప్పుడే ఎండలు దంచికొడుతున్నాయి. ఫిబ్రవరిలోనే ఇలా ఉంటే మరి వచ్చే మాసాల్లో?

Weather Forecast: వామ్మో.. ఎండలు బాబోయ్‌ ఎండలు.. మరో 3 రోజులు వాతావరణం ఎలా ఉండనుందో తెలుసా?

High Temperature

Updated On : February 14, 2025 / 3:24 PM IST

వేసవి కాలం ప్రారంభంలోనే ఎండల తీవ్రంగా బాగా ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 10 గంటలు దాటకముందే ఎండలు మండిపోతుండడంతో సమస్యలు ఎదుర్కొంటున్నారు.

ఫిబ్రవరిలోనే ఎండలు ఈ తీరుగా ఉంటే ఇక వచ్చే నెలల్లో ఎంతగా మండిపోతాయోనన్న ఆందోళన నెలకొంది. ప్రస్తుతం సగటు ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్‌కు పైగానే నమోదవుతోంది.

మధ్యాహ్నం సమయంలో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్ర మరింత పెరిగే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

ఆంధ్రప్రదేశ్‌లో శుక్రవారం, శనివారం ఉష్ణోగ్రతలు మరింత అధికమయ్యే ఛాన్స్‌ ఉందని చెప్పింది. శుక్రవారం ఉత్తర కోస్తాలో పొడి వాతావరణం ఉంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణం కంటే 3-5 డిగ్రీలు ఎక్కువగా నమోదువుతున్నాయి.

Also Read: షాకింగ్‌.. ఆ బ్యాంకుపై ఆర్‌బీఐ ఆంక్షలు.. డబ్బులు విత్‌డ్రా చేసుకోలేకపోతున్న కస్టమర్లు.. భారీ క్యూ..

ఇక రాయలసీమలో శుక్ర, శని, ఆదివారాల్లో పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-4 డిగ్రీలు అధికంగా నమోదయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు.

ఇవాళ కూడా పరిస్థితి ఇలాగే ఉంది. ఎండ తీవ్రత మరింత పెరిగే ఛాన్స్ ఉంది. కొన్ని ప్రాంతాల్లో 37 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు దాటి కనపడుతున్నాయి. ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉండడంతో తగిన జాగ్రతలు తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఉష్ణోగ్రతలు అలా ఉండగా తెలంగాణలో మాత్రం పూర్తిగా పొడి వాతావరణమే ఉండే అవకాశం ఉంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.