Superstitions : అనుమానంతో భార్యకు శీల పరీక్ష పెట్టిన భర్త.. మరిగే నూనెలో చెయ్యి పెట్టి ప్రాతివత్యాన్ని నిరూపించుకోవాలని షరతు
గుండయ్య, గంగమ్మ భార్యాభర్తలు. వీరికి నలుగురు పిల్లలు. నలుగురు పిల్లల్లో ఇద్దరికి పెళ్లిళ్ల అయ్యి పిల్లలు కూడా ఉన్నారు. మనవరాలు ఉన్న వయసులో గుండయ్య భార్య గంగమ్మపై అనుమానం పెంచుకున్నారు.

Superstitions
Superstitions in Chittoor : శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించినా కొంతమంది మూఢనమ్మకాలను ఆచరిస్తున్నారు. చిత్తూరు జిల్లా పూతలపట్టులో మూఢాచారం పురివిప్పింది. అమానుష రీతిలో ఓ వ్యక్తి భార్యకు శీల పరీక్ష పెట్టారు. సల సల మరిగే నూనెలో చెయ్యి పెట్టి, ప్రాతివత్యాన్ని నిరూపించుకోవాలని భార్యకు భర్త షరతు పెట్టాడు. పోలీసుల కథనం ప్రకారం.. గుండయ్య, గంగమ్మ భార్యాభర్తలు. వీరికి నలుగురు పిల్లలు.
నలుగురు పిల్లల్లో ఇద్దరికి పెళ్లిళ్ల అయ్యి పిల్లలు కూడా ఉన్నారు. మనవరాలు ఉన్న వయసులో గుండయ్య భార్య గంగమ్మపై అనుమానం పెంచుకున్నారు. సల సల మరిగే నూనెలో చెయ్యి పట్టి, ప్రాతివత్యాన్ని నిరూపించుకోవాలని భార్యకు షరతు పెట్టాడు. ఇందులో భాగంగా గ్రామ పెద్దల సమక్షంలోనే అలంకరించిన మట్టి పాత్రలో నూనె పోసి రోడ్డుపై పాత్ర కింద మంట పెట్టాడు.
కాలుతున్న నూనెలో చేతులు పెట్టడానికి గంగమ్మ సిద్ధమయ్యారు. అయితే విషయం తెలిసుకున్న ఎంపీడీవో గౌరీ, ఇతర అధికారులు అక్కడికి చేరుకుని ఆ అరాచకాన్ని అడ్డుకున్నారు. గుండయ్యను పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసులు అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు.