Swaroopanandendra Saraswati: దేవాదాయశాఖలో రెవెన్యూ పెత్తనం అవసరమా?: స్వరూపానందేంద్ర సరస్వతి
దేవాదాయశాఖలో రెవెన్యూ పెత్తనం అవసరమా? అంటూ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి పలు వ్యాఖ్యలు చేశారు. విశాఖలోని సింహాచలం దేవస్థానం శ్రీదేవి కాంప్లెక్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న స్వరూపానందేంద్ర సరస్వతి ఈ సందర్భంగా మాట్లాడుతూ... ‘‘అసలు దేవాలయ ఉద్యోగుల దౌర్భాగ్యం కాకపోతే..17 సంవత్సరాలకు పైగా ప్రమోషన్లు రాకపోవడమేమిటి? రెవెన్యూ శాఖ ఉద్యోగులను మన దేవాలయాలకు ఈవోలుగా వెయ్యడమేమిటి? దేవాలయ ఉద్యోగుల చేతకానితనంగానే భావించాలి’’ అని వ్యాఖ్యానించారు.

Swaroopanandendra Saraswati
Swaroopanandendra Saraswati: దేవాదాయశాఖలో రెవెన్యూ పెత్తనం అవసరమా? అంటూ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి పలు వ్యాఖ్యలు చేశారు. విశాఖలోని సింహాచలం దేవస్థానం శ్రీదేవి కాంప్లెక్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న స్వరూపానందేంద్ర సరస్వతి ఈ సందర్భంగా మాట్లాడుతూ… ‘‘అసలు దేవాలయ ఉద్యోగుల దౌర్భాగ్యం కాకపోతే..17 సంవత్సరాలకు పైగా ప్రమోషన్లు రాకపోవడమేమిటి? రెవెన్యూ శాఖ ఉద్యోగులను మన దేవాలయాలకు ఈవోలుగా వెయ్యడమేమిటి? దేవాలయ ఉద్యోగుల చేతకానితనంగానే భావించాలి’’ అని వ్యాఖ్యానించారు.
‘‘మీలో మీరు కోర్టులో కేసులు వేసుకోవడం వల్లే.. మీకు ప్రమోషన్లు రాక రెవెన్యూ శాఖ నుంచి అధికారులుగా వస్తూ.. మీపై పెత్తనాలు చేస్తున్నారు. దేవాదాయ శాఖలో ఉద్యోగంలో చేరిన నాటి నుంచి పదవీ విరమణ చేసేదాక స్వామి ఉత్సవాలలో జీవితాన్ని అర్పిస్తున్నవారు దేవాలయ ఉద్యోగులు. వైఖానసం, పాంచరాత్రం, శైవాగమనము తెలియని రెవెన్యూ ఉద్యోగులు ఇక్కడ ఉద్యోగం ఎలాచేయగలరు? ప్రభుత్వం ఏదైనా నేనిలాగే మాట్లాడతా. విశాఖ శ్రీ శారదాపీఠం దేవాలయాల కోసం, దేవాలయ ఉద్యోగులకు నిరంతరం పోరాడుతూనే ఉంటుంది’’ అని స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి చెప్పారు.
‘‘రెవెన్యూ శాఖకు భూములపై అవగాహన ఉంటుంది కానీ.. దేవాలయాలపై ఉంటుందా? సంవత్సరానికి ఇక్కడ దేవాదాయ శాఖలో ఉద్యోగం చేస్తున్న రెవెన్యూ వ్యక్తికి రూ.30 లక్షలకు పైగా జీతం ఎవరిస్తున్నారు? దేవాదాయశాఖ నుంచి కాదా? నేను మీ వెంట ఉంటా.. మీరంతా ఒకసారి సమావేశం పెట్టుకోండి.. నన్ను కూడా పిలవండి. దానితో పాటు మీ ఉద్యోగులపై మీరు పెట్టుకున్న కోర్టు కేసులను ఉపసంహరించుకోండి. దేవాదాయశాఖ ఉద్యోగులంతా ఐకమత్యంగా ఉండండి. మీకు ప్రమోషన్లు వచ్చేటట్లు నేనుచేస్తా’’ అని స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు.
10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..