Tadipatri : తాడిపత్రిలో మరోసారి టెన్షన్ టెన్షన్.. పెద్దారెడ్డిని అడ్డుకున్న పోలీసులు.. మీ కోరిక నెరవేరుస్తా అంటూ వార్నింగ్

Tadipatri : అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. పట్టణంలో టీడీపీ, వైసీపీ నేతలు పోటాపోటీ కార్యక్రమాలు చేపట్టారు.

Tadipatri : తాడిపత్రిలో మరోసారి టెన్షన్ టెన్షన్.. పెద్దారెడ్డిని అడ్డుకున్న పోలీసులు.. మీ కోరిక నెరవేరుస్తా అంటూ వార్నింగ్

Updated On : November 12, 2025 / 11:32 AM IST

Tadipatri : అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. పట్టణంలో టీడీపీ, వైసీపీ నేతలు పోటాపోటీ కార్యక్రమాలు చేపట్టారు. తాడిపత్రి పట్టణంలోని తన నివాసం వద్ద మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీగా వెళ్లేందుకు సిద్ధమైన ఆయన్ను పోలీసులు గృహనిర్భందం చేశారు. దీంతో పెద్దారెడ్డి పోలీసులతో వాగ్వివాదంకు దిగారు. మీరే అనుమతి ఇచ్చి మీరే ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించనుంది. ఇవాళ పెద్దెత్తున ర్యాలీ నిర్వహించాలని మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి నిర్ణయించారు. మరోవైపు తాడిపత్రిలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి శంకుస్థాపన కార్యక్రమం చేపట్టారు. ఈ నేపథ్యంలో పెద్దారెడ్డి నిరసన ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు. పెద్దారెడ్డిని ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు.

తన ర్యాలీని ఎలా అడ్డుకుంటారని పెద్దారెడ్డి ప్రశ్నించారు. పోలీసుల అనుమతితోనే యాడికి మండలానికి కార్యక్రమాన్ని మార్చుకున్నామని తెలిపారు. ఒక పార్టీ ఇన్చార్జిగా తాను కార్యక్రమాలు చేయకూడదా..? అంటూ పోలీసులతో పెద్దారెడ్డి వాగ్వాదంకు దిగారు. శాంతి భద్రతల సమస్య వస్తుందని అడ్డుకున్నామని పోలీసులు తెలుపగా.. లిఖితపూర్వకంగా ఇవ్వాలని పెద్దారెడ్డి డిమాండ్ చేశారు.

Also Read: Gold Rate Decrease: బంగారం కొనేవాళ్లకు బిగ్ అలర్ట్.. భారీగా తగ్గిన ధరలు.. ఏపీ, తెలంగాణలో ఇలా..

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మాట్లాడుతూ..
నేను బయట అడుగుపెడితే భూకంపం, తుఫాన్లు వచ్చినట్టు చేస్తున్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నిరసనలు చేస్తోంది. ఇక్కడ మాత్రం నేను మా కుటుంబం తప్ప ఎవరైనా నిరసనలు చేయవచ్చంటున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి చెప్పినట్టుగానే తాడిపత్రిలో నడుచుకుంటున్నారు. పైగా నాకు ప్రాణహాణి ఉందని, లా అండ్ ఆర్డర్ అంటున్నారు. వారు ఒక్క ఫోన్ కాల్ చేస్తేనే పోలీసులు వణికిపోతున్నారు. పైఅధికారులకు ఇక్కడున్న సీఐలు, ఎస్ఐలు రాంగ్ డైరెక్షన్ చేస్తున్నారు. నేను బయటకు వెళ్లినా ఏమీ కాదు.. ఇదంతా జేసీ వాళ్లు చెప్పిందే పోలీసులు చేస్తున్నారు. ఐపీఎస్ లను దూషించినా ఎలాంటి చర్యలు ఉండటం లేదు.. సీఎం చంద్రబాబు తాడిపత్రిలో ఏం జరుగుతోందో తెలుసుకోవాలి అంటూ జేసీ పెద్దారెడ్డి సూచించారు. చంద్రబాబూ.. ఇక్కడ మీ సామాజికవర్గాన్ని ఎలా హీణంగా చూస్తున్నారో కనుక్కోండి. కనీసం 10శాతం మంది జేసీకి మద్దతు చెప్పినా.. మీరు ఆయనకు మద్దతు ఇవ్వొచ్చు. నన్ను పంచెలు ఊడదీసి తంతానని జేసీ, వారి మహిళా కౌన్సిలర్లు అంటున్నారు. అదేదో చేయండి నేను కూడా చూస్తాను. ఓర్పు అనే దానికి ఒక హద్దు ఉంటుంది. నేను అధికారంలోకి వస్తే ఫ్యాక్షన్ చేస్తానంటున్నారు. దేవుడు నాకు మళ్లీ అవకాశం ఇస్తే.. మీ కోరిక కచ్చితంగా నెరవేరుస్తా. దానికి సమయం, సందర్భం కచ్చితంగా వస్తాయి అంటూ పెద్దారెడ్డి హెచ్చరించారు.

ఎమ్మెల్యే జెసి అస్మిత్ రెడ్డి కామెంట్స్..
గత ఐదేళ్లలో ఏం జరిగిందో పెద్దారెడ్డి ఒకసారి గుర్తు చేసుకోవాలి. కార్యక్రమం నిర్వహించాల్సినప్పుడు ఉదయం పూటే వెళ్లాలి. అలా కాకుండా ఎందుకు డ్రామాలు చేస్తున్నారు..? మేము ఎక్కడా ఆపడం లేదు.. అడ్డుకోవడం లేదు. వైసీపీలో ఐదేళ్ల నిర్లక్ష్యం వల్ల నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదు. ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వంలో ఏం చేశారు..? మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తే తప్పేముది..? అంటూ అస్మిత్ రెడ్డి ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వంలో పోలీసులు తమ విధులను నిర్వర్తిస్తున్నారు. పెద్దారెడ్డి ఫ్యాక్షన్ చేయాలంటే ఏ కాలంలో ఉన్నారో చూసుకోండి.. అసలు ఆయన వెంట ఎంతమంది వస్తారో ముందు తెలుసుకోవాలి. ఆయనే కత్తి పట్టి తిరుగుతాడా అంటూ అస్మిత్ రెడ్డి అన్నారు.