Drugs Selling In Visakhapatnam : విశాఖలో మరోసారి డ్రగ్స్ కలకలం.. బెంగళూరు నుంచి వచ్చి విక్రయిస్తున్న ముఠా అరెస్టు

విశాఖలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. నూతన సంవత్సరం వేళ యువతను ముఠా టార్గెట్ చేసింది. బెంగళూరు నుంచి వచ్చి విశాఖలో డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు.

Drugs Selling In Visakhapatnam : విశాఖలో మరోసారి డ్రగ్స్ కలకలం.. బెంగళూరు నుంచి వచ్చి విక్రయిస్తున్న ముఠా అరెస్టు

drugs in Visakhapatnam

Updated On : December 17, 2022 / 8:27 AM IST

Drugs Selling In Visakhapatnam :  విశాఖలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. నూతన సంవత్సరం వేళ యువతను ముఠా టార్గెట్ చేసింది. బెంగళూరు నుంచి వచ్చి విశాఖలో డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి వివరాలను రాబడుతున్నారు. పట్టుబడ్డ వారిలో ఓ రాజకీయ నాయకుడి కుమారుడు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. బెంగళూరులో డ్రగ్స్ కొనుగోలు చేసి విశాఖలో అమ్ముతుండగా పోలీసులకు సమాచారం వచ్చింది.

బీచ్ రోడ్డులోని కామత్ హోటల్ సమీపంలో ముఠా డ్రగ్స్ అమ్ముతుండగా పక్కా ప్లాన్ ప్రకారం పోలీసులు మాటు వేసి డ్రగ్స్ విక్రయిస్తున్న నలుగురు ముఠా సభ్యులను పట్టుకుని, డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు లక్షల రూపాయల్లో ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. విశాఖలోని ఓ బడా రాజకీయనేత నేత కొడుకు సైతం ఈ డ్రగ్స్ ముఠాలో ఉన్నట్లు తెలుస్తోంది.

Andhra pradesh : విశాఖలో క్రిస్టల్ రూపంలో విద్యార్ధులకు డ్రగ్స్ సరఫరా..ముగ్గురు అరెస్ట్

ఎన్నడూ లేని విధంగా టాస్క్ ఫోర్స్ కేసుల్లో పెద్ద మొత్తంలో డ్రగ్స్ దొరకడం ఇదే మొదటిసారి. ఇప్పటికే నగరంలో డ్రగ్స్ ముఠాలను జల్లెడ పట్టే విధంగా డీసీపీ శ్రీకాంత్ వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా యువతను టార్గెట్ చేస్తూ డ్రగ్స్ ను విక్రయిస్తున్న ముఠాలపై ఇప్పటికే పోలీసులు ఉక్కుపాదం మోపారు. గతంలో డ్రగ్స్ అమ్ముతూ అరెస్టైన నిందితులపై నిఘా ఉంచారు. అయితే చాపకింద నీరులాగా డ్రగ్స్ నరగంలోకి వస్తూనేవుంది.