Kinjarapu Atchannaidu: జగన్ పిచ్చి పరాకాష్టకు చేరింది.. అవినీతి జరిగిందని ఒక ఊహాలోకాన్ని సృష్టించారు
రూ.380 కోట్లు అవినీతి జరిగిందని ఒక ఊహాలోకాన్ని సృష్టించారు. చంద్రబాబును కావాలని ఇంత దారుణంగా అరెస్ట్ చేయడాన్ని ప్రజలంతా గమనించాలని అచ్చెన్నాయుడు కోరాడు.

Kinjarapu Atchannaidu
TDP AP President Kinjarapu Atchannaidu: జగన్ పిచ్చి పరాకాష్టకు చేరిందని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. దేశంలో ఏ ఒక్కరిని అడిగినా చంద్రబాబు దార్శనికత చెబుతారు. కావాలనే చంద్రబాబును స్కిల్ డవలప్‌మెంట్ కేసులో ఇరికించి అక్రమంగా అరెస్టు చేశారని అన్నారు. రాజకీయ కక్షతోనే ప్రతిపక్ష పార్టీలను ఇబ్బంది పెట్టడమే జగన్ పని. ప్రతిపక్ష నాయకులను జైలులో పెట్టి ఆనందపడుతున్న వ్యక్తి జగన్ అంటూ అచ్చెన్నాయుడు విమర్శించారు.
Lokesh Nara: పవన్ కళ్యాణ్‌ను పోలీసులు అడ్డుకోవడంపై నారా లోకేశ్ ఫైర్.. అర్థరాత్రి ఏం జరిగిందంటే?
చంద్రబాబు ఉగ్రవాది కాదు, పారిపోయే వ్యక్తి కాదు, చంద్రబాబు ఎక్కడో దాక్కునే వ్యక్తి కాదని అన్నారు. ఐదేళ్లు స్కిల్ డెవలప్‍మెంట్ ప్రాజెక్టుతో ఉద్యోగాలు పొందారు. రూ.380 కోట్లు అవినీతి జరిగిందని ఒక ఊహాలోకాన్ని సృష్టించారని అన్నారు. చంద్రబాబును కావాలని ఇంత దారుణంగా అరెస్ట్ చేయడాన్ని ప్రజలంతా గమనించాలని అచ్చెన్నాయుడు కోరాడు. చట్టం లేదు, న్యాయం లేదు, ధర్మం లేదు కేవలం రాజకీయ కక్షతోనే ప్రతిపక్షంపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.