Chandrababu : బతుకులు మారాలన్నా, కష్టాలు తీరాలన్నా టీడీపీ-జనసేన ప్రభుత్వం రావాలి- చంద్రబాబు

ముఖ్యమంత్రి అనే వాడు భూమి మీద తిరుగుతాడా లేక ఆకాశంలో తిరుగుతాడా? అని ప్రశ్నించారు. జగన్ పాలనలో మురుగు నీరు కూడా పొలాల్లోకి వచ్చే దుస్థితి దాపురించింది.

Chandrababu : బతుకులు మారాలన్నా, కష్టాలు తీరాలన్నా టీడీపీ-జనసేన ప్రభుత్వం రావాలి- చంద్రబాబు

Chandrababu Fires On Jagan (Photo : Facebook)

సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఉల్లిగడ్డకు, ఆలుగడ్డకు తేడా తెలియని ముఖ్యమంత్రికి రైతుల కష్టాలెలా తెలుస్తాయని చంద్రబాబు అన్నారు. తప్పుడు పనులు తప్ప ముఖ్యమంత్రి జగన్ కి ఏమీ తెలియదన్నారు. ముఖ్యమంత్రి అనే వాడు భూమి మీద తిరుగుతాడా లేక ఆకాశంలో తిరుగుతాడా? అని ప్రశ్నించారు.

జగన్ పాలనలో మురుగు నీరు కూడా పొలాల్లోకి వచ్చే దుస్థితి దాపురించిందని చంద్రబాబు వాపోయారు. ప్రభుత్వం మాటలు కోటలు దాటుతుంటే చేతలు మాత్రం గడప దాటట్లేదని ధ్వజమెత్తారు చంద్రబాబు. పేదల బతుకులు మారాలన్నా, రైతుల కష్టాలు తీరాలన్నా, రాష్ట్రంలో రహదారులు బాగుపడాలన్నా తెలుగుదేశం-జనసేన ప్రభుత్వం రావాలన్నారు చంద్రబాబు.

చంద్రబాబుతో గోడు వెళ్లబోసుకున్న రైతులు..
వేమూరు నియోజకవర్గంలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించారు. వేమూరు నియోజకవర్గం కూచిపూడి, పెదపూడి, అమృతలూరులో దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించారు. బాధిత రైతులతో చంద్రబాబు మాట్లాడారు. చంద్రబాబు ముందు తమ గోడు వెళ్ళబోసుకున్నారు కూచిపూడి రైతులు.

Also Read : అహంకారంతో ఉంటే ఏమవుతుందో తెలంగాణలో చూశాం.. ఏపీలో కూడా అదే చూస్తాం: చంద్రబాబు

రైతుల కష్టం చూస్తే బాధేస్తోంది..
ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు విరుచుకుపడ్డారు. సీఎం జగన్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. తెనాలి-చెరుకుపల్లి రోడ్డు అధ్వాన్నంగా ఉన్నా కనీస మరమ్మతులు కూడా చేయలేదని ధ్వజమెత్తారు. ప్రకృతి విపత్తుకు మానవ తప్పిదం తోడవటం వల్లే రైతులు తీవ్రంగా నష్టపోయారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులు తీవ్ర ఆవేదనను కలిగించాయన్నారు. చేతికందిన పంట నీట మునిగిన వేళ రైతుల కష్టం చూస్తే బాధేస్తోందన్నారు. కౌలు రైతులు మరింత కుదేలయ్యారని అన్నారు.

ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించాలి..
ప్రభుత్వం వెంటనే బాధిత రైతులను ఆదుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. అన్నదాతకు పరిహారంపై ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించాలని సూచించారు. గ్యారెంటీ లేకుండా పోయిన రైతన్నకు సాగు కొనసాగించేలా ప్రభుత్వం భరోసా ఇవ్వాలన్నారు. ఈ ప్రభుత్వం పంట కాల్వల్లో పూడిక తీయలేదు, రైతులకు కనీసం గోనె సంచులు ఇవ్వలేదని ధ్వజమెత్తారు చంద్రబాబు. పేదల బతుకులు మారాలన్నా, రైతుల కష్టాలు తీరాలన్నా, రాష్ట్రంలో రహదారులు బాగుపడాలన్నా తెలుగుదేశం-జనసేన ప్రభుత్వం రావాలన్నారు చంద్రబాబు.

Also Read : స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా

3 నెలల్లో టీడీపీ-జనసేన ప్రభుత్వం వస్తుంది..
రైతుల తరపున పలు డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉంచారు చంద్రబాబు. ”తుపాను వల్ల వరిపంట నష్టపోయిన రైతులకు హెక్టారుకు 30వేల చొప్పున పరిహారం ఇవ్వాలి. ఆక్వా రైతులకు 50వేలు, అరటికి 40వేలు, చెరకుకు రూ.30వేలు ఇవ్వాలి. పత్తి, వేరుశనగకు 25వేలు.. జొన్న, మొక్కజొన్న, అపరాలు, పొద్దుతిరుగుడుకు రూ.15వేలు, జీడి పంటకు 50వేల చొప్పున పరిహారం ఇవ్వాలి” అని జగన్ సర్కార్ ను డిమాండ్ చేశారు చంద్రబాబు. రైతుల డిమాండ్లను జగన్ సర్కార్ తక్షణమే పరిష్కరించకుంటే, 3 నెలల్లో అధికారంలోకి వచ్చే తెలుగుదేశం-జనసేన ప్రభుత్వo పరిష్కరిస్తుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరినీ ఆదుకుంటానని భరోసా ఇచ్చారు చంద్రబాబు.