Chandrababu Naidu: ఢిల్లీకి పయనం కానున్న చంద్రబాబు నాయుడు
చంద్రబాబు ఢిల్లీ పర్యటన తర్వాత పవన్ కూడా ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. చంద్రబాబు ఢిల్లీ పర్యటన తర్వాత బీజేపీతో పొత్తులపై క్లారిటీ రానుంది.

Chandrababu Naidu
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రేపు రాత్రి ఢిల్లీకి వెళ్లనున్నారు. బీజేపీ అధిష్ఠానం పొత్తులపై చంద్రబాబుతో మంతనాలు జరపనుంది. ఎనిమిదో తేదీన చంద్రబాబు – పవన్ భేటీ కావాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటన తర్వాత పవన్ కూడా ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. చంద్రబాబు ఢిల్లీ పర్యటన తర్వాత బీజేపీతో పొత్తులపై క్లారిటీ రానుంది.
టీడీపీ-జనసేన కూటమితో బీజేపీ కలుస్తుందని చాలా కాలంగా ఊహాగానాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ మధ్య రెండు రోజుల క్రితం ఈ విషయంపై సుదీర్ఘనంగా చర్చలు జరిగాయి. పోటీ చేసే స్థానాలపై చంద్రబాబు – పవన్ స్పష్టతకు వచ్చారు. ఆశావహులకు నచ్చజెప్పి వారి రాజకీయ భవిష్యత్తుకు హామీ ఇవ్వాలని ఇరు పార్టీల అధినేతలు నిర్ణయం తీసుకున్నారు.
టీడీపీ-జనసేన కూటమితో బీజేపీ కలుస్తే ఆ పార్టీకి ఇవ్వాల్సిన సీట్లపై కూడా ఇప్పటికే చంద్రబాబు-పవన్ చర్చించినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలతో బీజేపీ కలుస్తుందా? అన్న ప్రశ్నకు నాలుగు రోజుల్లో స్పష్టతవచ్చే అవకాశం ఉంది. సీట్ల సర్దుబాటుపై అధికారిక ప్రకటన కోసం టీడీపీ-జనసేన నేతలు ఎదురు చూస్తున్నారు. వైసీపీ ఇప్పటికే జాబితాలను ప్రకటిస్తోంది.
KCR: సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ సీఎం కేసీఆర్ హాట్ కామెంట్స్