టికెట్ వస్తుందా? రాదా? కర్నూలు టీడీపీ నేతల్లో టికెట్ల టెన్షన్

ఫస్ట్ లిస్ట్ లో తమ పేరు లేకపోవడంతో అసలు టికెట్ వరిస్తుందా? లేదా? అని టెన్షన్ పడుతున్నారు.

టికెట్ వస్తుందా? రాదా? కర్నూలు టీడీపీ నేతల్లో టికెట్ల టెన్షన్

Kurnool TDP

 

 

Kurnool TDP : కర్నూలు జిల్లా టీడీపీని టికెట్ల కలవరం వేధిస్తోంది. నాలుగు నియోజకవర్గాల టీడీపీ ఇంఛార్జ్ లను టికెట్ గుబులు వెంటాడుతోంది. ఆదోని, ఆలూరు, మంత్రాలయం, ఎమ్మిగనూరు టీడీపీ ఇంఛార్జ్ లు టికెట్లు వస్తాయో రావో అని టెన్షన్ పడుతున్నారు. ఈ నియోజకవర్గాల ఇంఛార్జ్ లుగా ఉన్న మీనాక్షి నాయుడు, కోట్ల సుజాతమ్మ, పాలకుర్తి తిక్కారెడ్డి, బీవీ జయనాగేశ్వర రెడ్డి గత పదేళ్లుగా పార్టీ కోసం శ్రమిస్తున్నారు. అయితే, ఫస్ట్ లిస్ట్ లో తమ పేరు లేకపోవడంతో అసలు టికెట్ వరిస్తుందా? లేదా? అని టెన్షన్ పడుతున్నారు.

కర్నూలు పార్లమెంటు పరిధిలోని నాలుగు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జుల్లో హైటెన్షన్ నెలకొంది. కేడర్ లోనూ తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఆలూరు నియోజకవర్గానికి సంబంధించి కోట్ల సుజాతమ్మ భర్త డోన్ అభ్యర్థిగా ప్రకటించడంతో అక్కడ సమస్య లేదనేది స్పష్టంగా అర్థమవుతోంది. ఆలూరు నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ అభ్యర్థిగా వీరభద్రగౌడ్ ను నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీసీ సామాజికవర్గానికి చెందిన నాయకుడు కావడంతో వీరభద్రగౌడ్ కు కచ్చితంగా టికెట్ వస్తుందని ఆలూరు టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు ఇంఛార్జుల్లో మాత్రం టెన్షన్ నెలకొంది.

మంత్రాలయం నియోజకవర్గంలో గత పదేళ్లుగా పాలకుర్తి తిక్కారెడ్డి ఇంఛార్జిగా ఉన్నారు. తిక్కారెడ్డి పదేళ్లుగా టీడీపీని అంటి పెట్టుకుని ఉన్నారని, ప్రజల మధ్యన ఉంటూ అభివృద్ధికి కృషి చేసిన ఆయనకే టికెట్ ఇవ్వాలని కేడర్ డిమాండ్ చేస్తోంది. ఎమ్మిగనూరు విషయానికి వస్తే.. బీవీ మోహన్ రెడ్డి తనయుడు బీవీ జయనాగేశ్వర రెడ్డికి టికెట్ విషయంలో క్లారిటీ లేదు. మాచాని సోమప్ప ముని మనవడు సోమనాథ్ కూడా టికెట్ ఆశిస్తున్నారు. ప్రస్తుతం వైసీపీ ఇంఛార్జిగా ఉన్న బుట్టా రేణుక అల్లుడు కూడా టికెట్ రేసులో ఉన్నారు. బీవీ జయనాగేశ్వర రెడ్డికి కాకుండా బీసీ సామాజికవర్గానికి టికెట్ ఇచ్చే ఆలోచనలో టీడీపీ ఉన్నట్లు సమాచారం అందుతోంది.

ఆదోని విషయానికి వస్తే.. జనసేన అభ్యర్థికి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. జనసేన అభ్యర్థిగా గతంలో పోటీ చేసిన మల్లప్పకి ఆదోని టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. ఆదోని టీడీపీ ఇంఛార్జి మీనాక్షి నాయుడికి ఈసారి టికెట్ లేనట్లే అని తెలుస్తోంది. ఈ కారణాలతోనే ఈ నాలుగు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించలేదని సమాచారం.

Also Read : ఎవరికి ఎవరు పోటీ? టీడీపీ-జనసేన కూటమి, వైసీపీ అభ్యర్థుల బలాబలాలు ఇవే..