Andhra Pradesh : పోలీస్ స్టేషన్‌లో అర్థరాత్రి కరెంట్ తీసేసి నన్ను కొట్టారు : టీడీపీ నేత పట్టాభి
గన్నవరం టీడీపీ కార్యాలయం ధ్వంసం చేసిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయటానికి వెళ్లిన టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాబిని పోలీసులు అరెస్ట్ చేయటం..రిమాండ్ కు తరలించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో పట్టాబికి బెయిల్ మంజూరు చేసింది కోర్టు. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదల అయిన తరువాత పట్టాబి మాట్లాడుతూ..తనను తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్ లో అర్థరాత్రి కరెంట్ తీసేసి పోలీసులను తనను కొట్టారని తెలిపారు. ఇప్పటికే నాపై నాలుగుసార్లు దాడి చేశారని..తెలిపారు.

TDP leader pattabhi released from rajahmundry central jail
Andhra Pradesh : గన్నవరం టీడీపీ కార్యాలయం ధ్వంసం చేసిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయటానికి వెళ్లిన టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాబిని పోలీసులు అరెస్ట్ చేయటం..రిమాండ్ కు తరలించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో పట్టాబికి బెయిల్ మంజూరు చేసింది కోర్టు. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదల అయిన తరువాత పట్టాబి మాట్లాడుతూ..తనపై అక్రమంగా కేసులు పెట్టారని..తమ పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారని ఫిర్యాదు చేయటానికి వెళ్లిన తనపైనే అక్రమ కేసులు బనాయించారని తనను అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేశారని తెలిపారు. అలా తనను పలు ప్రాంతాల్లో తిప్పి తిప్పి తోట్ల వల్లూరు పోలీస్ స్టేషన్ కు తరలించారని..పీఎస్ లో అర్థరాత్రి కరెంట్ తీసేసి పోలీసులను తనను కొట్టారని తెలిపారు. ఇప్పటికే నాపై నాలుగుసార్లు దాడి చేశారని..తెలిపారు. తప్పులను, నేరాలను ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు పెట్టటం..అక్రమంగా అరెస్ట్ లు చేయటం వైసీపీ ప్రభుత్వానికి అలవాటేనని ఇలా అక్రమ కేసులతో అరెస్టులతో తాము బెదిరేది లేదని తేల్చి చెప్పారు. వైసీపీ ప్రభుత్వం చేసే అన్యాయాలను ప్రశ్నించటం మానని..వైసీపీ ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేస్తానని స్పష్టంచేశారు టీడీపీ అధికార ప్రతినిధి పట్టాబి.
రాజమండ్రి సెంట్రల్ జైల్ నుంచి విడుదలైన పట్టాభికి టీడీపీ నేతలు, అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. జిల్లా కోర్టు ఆయనకు రూ.25 వేల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.. జైలు నుంచి విడుదలైన సందర్భంగా పట్టాభి మీడియాతో మాట్లాడుతూ మరోసారి తనదైనశైలిలో వైపీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వం పెట్టే తప్పుడు కేసులకు భయపడి లొంగిపోయేది లేదని స్పష్టం చేశారు. గన్నవరంలో ఏం జరిగిందో అందరూ చూశారని అన్నారు. గూండాల్లా వ్యవహరిస్తు టీడీపీ ఆఫీసుని ధ్వంసం చేసినవారికి త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. తెలుగు దేశం పార్టీ బలహీన వర్గాలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని..ప్రజలు ఇచ్చే తీర్పుకు వైసీపీ కొట్టుకుపోతుందన్నారు.
పోలీస్ స్టేషన్‌లోనే దుండగులతో తనపై దాడి చేయించిన తీరుతో ఇది ప్రజాస్వామ్యమా? గూండాల రాజ్యమా? అనేలా ఉందని..ప్రజలు ప్రతీది గమనిస్తున్నారని..ఎన్ని దాడులు జరిగినా తాను వెనకడుగు వేసేదే లేదని తేల్చి చెప్పారు. టీడీపీ నేత చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అడుగు ముందుకు వేస్తామని..కష్టసమయంలో తనకు, తన కుటుంబసభ్యులకు అండగా నిలిచిన టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటూ ఇతర నేతలకు ఈ సందర్భంగా పట్టాభి ధన్యవాదాలు తెలిపారు.