Nara Lokesh: ‘యువగళం’ పేరుతో ప్రజల్లోకి లోకేష్.. నేడు పాదయాత్ర వివరాలు వెల్లడించనున్న టీడీపీ నేతలు

నారా లోకేష్ జనవరి 27నుంచి మహాపాదయాత్ర చేపట్టనున్నారు. అయితే, ఈ పాదయాత్ర ఏ జిల్లాలో ప్రారంభమవుతుంది, ఎన్ని జిల్లాల్లో కొనసాగుతుంది.. ఏ నియోజకవర్గం మీదుగా సాగుతుంది అనే విషయాలపై టీడీపీ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  ఇందుకు సంబంధించిన వివరాలను బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో టీడీపీ నేతలు వెల్లడించనున్నారు.

Nara Lokesh: ‘యువగళం’ పేరుతో ప్రజల్లోకి లోకేష్.. నేడు పాదయాత్ర వివరాలు వెల్లడించనున్న టీడీపీ నేతలు

Nara Lokesh

Updated On : December 28, 2022 / 11:14 AM IST

Nara Lokesh: ఏపీలో రాజకీయాలు హీటెక్కాయి. ఎన్నికల సమయం దగ్గరపడుతున్నా కొద్దీ అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు నిత్యం ప్రజల్లో ఉండేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఏపీలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇప్పటికే ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జిల్లాల్లో పర్యటిస్తూ టీడీపీ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు. ఈ క్రమంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిత్యం ప్రజల్లో ఉండేందుకు పాదయాత్రను చేపట్టబోతున్నారు. జనవరి 27 నుంచి ఈ పాదయాత్ర ప్రారంభం అవుతుంది.

Nara Lokesh : వైసీపీకి షాక్.. టీడీపీలో చేరిన ఎమ్మెల్యే ఆర్కే ముఖ్య అనుచరుడు

నారా లోకేష్ చేపట్టబోయే మహాపాదయాత్రకు సంబంధించిన వివరాలను ఇవాళ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పార్టీ ముఖ్యనాయకులు అధికారికంగా వెల్లడించనున్నారు. లోకేష్ పాదయాత్రకు ‘యువగళం’ పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. 400రోజుల పాటు 4వేల కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర సాగనుంది. కుప్పం నుంచి పాదయాత్రకు లోకేష్ శ్రీకారం చుట్టనున్నట్లు తెలిసింది.

Nara Lokesh Mahapadayatra Name 'Yuvagalam'

Nara Lokesh Mahapadayatra Name ‘Yuvagalam’

Nara Lokesh: నారా లోకేష్ పాదయాత్రకు ముహూర్తం ఖరారు.. జనవరి 27 నుంచి యాత్ర ప్రారంభం

లోకేష్ పాదయాత్ర ఏ జిల్లాలో ప్రారంభమవుతుంది, ఎన్ని జిల్లాల్లో కొనసాగుతుంది.. ఏ నియోజకవర్గం మీదుగా సాగుతుంది అనే విషయాలపై టీడీపీ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  ఇందుకు సంబంధించిన వివరాలను బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో టీడీపీ నేతలు వెల్లడించనున్నారు. రూట్ మ్యాప్, ఇతర వివరాలతో పాటు లోకేష్ పాదయాత్రపై ప్రొమోసైతం విడుదల చేయనున్నారు.