TDP : నారా లోకేష్ అధ్యక్షతన టీడీపీ విస్తృతస్థాయి సమావేశం.. తెలుగుదేశం శ్రేణుల్ని ఎన్నికలకు సన్నద్ధం చేయటమే ప్రధాన అజెండా

నిజం గెలవాలి పేరిట నారా భువనేశ్వరి యాత్ర, చంద్రబాబు అరెస్టుతో ఆగిన బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నారా లోకేష్ పునరుద్ధరణ, బాబుతో నేను కార్యక్రమం కొనసాగింపుపై కీలక చర్చ జరుగనుంది.

TDP : నారా లోకేష్ అధ్యక్షతన టీడీపీ విస్తృతస్థాయి సమావేశం.. తెలుగుదేశం శ్రేణుల్ని ఎన్నికలకు సన్నద్ధం చేయటమే ప్రధాన అజెండా

TDP Meeting

Updated On : October 21, 2023 / 7:59 AM IST

TDP Meeting – Election Preparation : నేడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం జరుగనుంది. నారా లోకేష్ అధ్యక్షతన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉదయం10 గంటలకు సమావేశం కానున్నారు. జనసేనతో సమన్వయంతో తెలుగుదేశం శ్రేణుల్ని ఎన్నికలకు సన్నద్ధం చేయటమే ప్రధాన అజెండాగా సమావేశం నిర్వహించనున్నారు. నిజం గెలవాలి పేరిట నారా భువనేశ్వరి యాత్ర, చంద్రబాబు అరెస్టుతో ఆగిన బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నారా లోకేష్ పునరుద్ధరణ, బాబుతో నేను కార్యక్రమం కొనసాగింపుపై కీలక చర్చ జరుగనుంది.

ఓటర్ వెరిఫికేషన్, పార్టీ సంస్థాగత నిర్మాణం అంశాలపైనా కీలక చర్చ చేయనున్నారు. చంద్రబాబు అరెస్టు ఆవేదనతో మృతి చెందిన వారికి నేతలు నివాళులర్పించి సంతాపం తెలపనున్నారు. అచ్చెన్నాయుడు ప్రారంభోపన్యాసం చేయనున్నారు. నారా లోకేష్ కీలకోపన్యాసం చేయనున్నారు.

BJP : నేడు బీజేపీ అభ్యర్థుల ప్రకటన.. 55 మందితో తొలి జాబితా రిలీజ్

బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీపై కాల్వ శ్రీనివాసులు ప్రసంగించనున్నారు. ఓటర్ వెరిఫికేషన్ పై జీవీ ఆంజనేయులు, నిజం గెలవాలి అంశంపై పంచుమర్తి అనురాధ ప్రసంగించనున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపై నిమ్మల రామానాయుడు మాట్లాడనున్నారు.