Atchannaidu : స్పీకర్ టీడీపీ సభ్యుల్ని యూజ్‌లెస్ ఫెలోస్ అని తిట్టారు, ఆ స్థానంలో ఉండి అలా అనొచ్చా : అచ్చెన్నాయుడు

సభలో అసలు ఏం జరుగుతోందో అర్థం కావటంలేదని..స్పీకర్ పదవిలో ఉన్న వ్యక్తి సభ్యులు అందరిని సమానంగా చూడాలని కానీ స్పీకర్ తమ్మినేని మాత్రం అలా చూడకుండా వ్యవహరిస్తున్నారని టీడీపీ సభ్యుల్ని కట్టడి చేస్తున్నారంటూ విమర్శించారు.

Atchannaidu : స్పీకర్ టీడీపీ సభ్యుల్ని యూజ్‌లెస్ ఫెలోస్ అని తిట్టారు, ఆ స్థానంలో ఉండి అలా అనొచ్చా : అచ్చెన్నాయుడు

TDP MLA Achennaidu

Atchannaidu..tammineni sitaram : ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల్ని స్పీకర్ తమ్మినేని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. గురువారం 14మంది టీడీపీ సభ్యుల్ని ఒకేసారి సస్పెండ్ చేశారు. అలాగే గురువారం సభలో వీడియో తీసారు అనే ఆరోపణలో టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు, అశోక్ లను ఈరోజు స్పీకర్ సభ నుంచి సస్పెండ్ చేశారు. సమావేశాలు పూర్తి అయ్యేంత వరకు సభకు హాజరు కాకూడదంటూ సస్పెండ్ విధించారు. దీనిపై అచ్చెన్నాయుడు మాట్లాడుతు..సభలో అసలు ఏం జరుగుతోందో అర్థం కావటంలేదని..స్పీకర్ పదవిలో ఉన్న వ్యక్తి సభ్యులు అందరిని సమానంగా చూడాలని కానీ స్పీకర్ తమ్మినేని మాత్రం అలా చూడకుండా వ్యవహరిస్తున్నారని టీడీపీ సభ్యుల్ని కట్టడి చేస్తున్నారంటూ విమర్శించారు. అందుకే అసలు సభలో ఏం జరుగుతుందో తెలియాలని తాను వీడియో తీశానని అందుకే సస్పెండ్ చేశామని చెబుతున్నారని తెలిపారు. అంతేకాకుండా టీడీపీ సభ్యుల్ని స్పీకర్ తమ్మినేని చాలా అవమానకరంగా మాట్లాడుతున్నారని ‘యూజ్ లెస్ ఫెలోస్’అంటూ తమను దూషించారంటూ తెలిపారు. స్పీకర్ స్థానంలో ఉన్నవారు అలా మాట్లాడొచ్చా..?అని ప్రశ్నించారు.

Chandrababu Remand: చంద్రబాబుకు మరో రెండు రోజులు రిమాండ్ పొడిగింపు.. జడ్జితో బాబు ఏమన్నారంటే

స్పీకర్ స్థానంలో ఉన్నవారు ఏ పార్టీ వారైనా సభలో అందరినీ ఒకేలా చూడాలి..కానీ తమ్మినేని మాత్రం స్పీకర్ స్థానంలో ఉండి అధికార పక్ష నేతల్ని ఒకలా..ప్రతిపక్ష నేతల్ని మరోలా చూస్తున్నారు అంటూ విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ నేతల్ని ‘యూజ్ లెస్ ఫెలోస్’ అంటూ దూషించారని ఆ స్థానంలో ఉన్నవారు అలా మాట్లాడొచ్చా..? అంటూ ప్రశ్నించారు. 22మంది కోసం ఏకంగా 200లమంది మార్షల్స్ ను పెట్టి తమకు అడ్డుకుంటున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మార్షల్స్ ను పెట్టి సభను నడిపిస్తున్నారని..అసలు శాసనసభలో ఏం జరుగుతుందో బయటకు తెలియనివ్వకుండా స్పీకర్ వ్యవహరిస్తున్నారని అందుకే వీడియో తీశాం అని వివరించారు.

Ambati Rambabu : ఆ అపవాదు చెరుపుకోండి అంటూ బాలకృష్ణకు అంబటి సూచనలు

ఇటువంటి పరిస్థితుల్లో సభకు హాజరుకావటంపై నిరసన వ్యక్తంచేస్తు టీడీపీ సభ్యులు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారు. ప్రభుత్వ తీరును నిరసిస్తు సమావేశాలను బహిష్కరించారు. కాగా ఐదు రోజులు సమావేశాలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈరోజుకు రెండు రోజులు సమావేశాలు జరిగాయి. దీంతో మరో మూడు రోజు అంటే రేపటి నుంచి సమావేశాలకు హాజరు కాకూడదని టీడీపీ నిర్ణయించింది. ఈక్రమంలో సమావేశాలను బహిష్కరించింది.