సూట్ కేసు సర్దుకో జగన్.. ఎందుకంటే… మాజీ సీఎంపై పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు
మాజీ మంత్రి, రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై సంచలన కామెంట్స్ చేశారు.

TDP MLA Paritala Sunitha
Paritala Sunitha: మాజీ మంత్రి, రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై సంచలన కామెంట్స్ చేశారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. జగన్ రెడ్డీ.. చంద్రబాబు బాయిలో పడటం కాదు.. నువ్వు నీరులేని బావిలో పడ్డా నీ పాపాలు పోవు అంటూ ఘాటుగా విమర్శించారు. సూట్ కేసు రెడీ చేసుకొని ఉండు.. త్వరలో జైలుకు వెళ్లాల్సి ఉంటుంది అంటూ పరిటాల సునీత సంచలన కామెంట్స్ చేశారు.
వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డిపైనా పరిటాల సునీత ఫైర్ అయ్యారు. ప్రకాశ్ రెడ్డికి నిద్రలో కూడా పరిటాల రవినే గుర్తొస్తున్నారు. ఆయన చనిపోయి 20ఏళ్లు అయింది.. ప్రకాశ్ రెడ్డి ఇంకా మీకు భయం పోలేదా అంటూ ప్రశ్నించారు..? పరిటాల రవి పేరు ఉచ్చరించకుండా మీ సమావేశాలే ఉండవు. పరిటాల రవి హత్యలు చేసి ఉంటే గత ఐదేళ్లలో ఎందుకు నిరూపించలేకపోయావు అంటూ పరిటాల సునీత ప్రశ్నించారు.
నిత్యం ఇలాంటి అబద్దాలతో కార్యకర్తలను రెచ్చగొడుతున్నావ్. 45రోజులుగా ఎక్కడ దాక్కున్నావ్..? చిన్న కేసు ఉంటేనే అడ్రస్ లేకుండా పోతావ్. నెలకు ఒకసారి వచ్చి కార్యకర్తలను రెచ్చగొట్టి పోతున్నావ్. మరోసారి పరిటాల కుటుంబం గురించి మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ ప్రకాశ్ రెడ్డికి పరిటాల సునీత హెచ్చరికలు జారీ చేశారు.