AP Govt: ఏపీలో టీచర్ల బదిలీలు.. ఈనెల 15 నుంచి ప్రక్రియ మొదలు.. వారికి మాత్రం మినహాయింపు..

ఏపీ ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన ప్రక్రియపై ఫోకస్ పెట్టింది.

AP Govt: ఏపీలో టీచర్ల బదిలీలు.. ఈనెల 15 నుంచి ప్రక్రియ మొదలు.. వారికి మాత్రం మినహాయింపు..

AP Teachers

Updated On : May 12, 2025 / 10:05 AM IST

AP Govt: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన ప్రక్రియపై ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో బదిలీల చట్టం ప్రకారం మొదటిసారి ఈ ప్రాసెస్ నిర్వహించనున్నారు. ఈనెల 15 నుంచి ఆన్ లైన్ ద్వారా బదిలీల ప్రక్రియ చేపట్టేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. సర్వీసుకు ప్రామాణిక తేదీగా మే31ని నిర్ణయించింది. ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్దీకరణ, బదిలీల ఉత్తర్వులను ప్రభుత్వం త్వరలో విడుదల చేయనుంది.

Also Read: Jawan Murali Naik: జవాన్ మురళీ నాయక్ అంతిమయాత్రలో పాల్గొన్న పవన్ కల్యాణ్, నారా లోకేశ్.. ఫొటోలు వైరల్

తొలుత ప్రధానోపాధ్యాయులకు బదిలీలు చేస్తారు. దీంతో ఖాళీ అయిన స్థానాలు, కొత్తగా అవసరమయ్యే వాటిల్లో స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పిస్తారు. తర్వాత మిగతా ప్రక్రియ ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్ పోస్టుల అవసరాల మేరకు సెంకడరీ గ్రేడ్ టీచర్ల పదోన్నతులు కల్పిస్తారు. ఎస్జీటీలకు ఆదర్శ ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు కల్పిస్తారు. కొంతమంది సబ్జెక్టు టీచర్లకూ ఆదర్శ పాఠశాలల హెచ్ఎంలుగా అవకాశం ఇవ్వనున్నారు.

Also Read: Ration Card: ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఇంటివద్ద నుంచే రేషన్ కార్డు‌కు అప్లయ్.. వాట్సాప్‌లో ఈ నంబర్‌కు మేసేజ్ చేస్తేచాలు

బదిలీల చట్టంను సవాల్ చేస్తూ కొంతమంది అంధ ఉపాధ్యాయులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కోర్టు స్టేటస్ కో విధించింది. దీంతో ఆ పోస్టులను మినహాయించి బదిలీల ప్రక్రియ చేపట్టాలని విద్యాశాఖ భావిస్తోంది. అయితే, ఐచ్ఛికాలు పెట్టుకునేందుకు మాత్రం వారికి అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. కోర్టు తీర్పునకు లోబడి ఆ తరువాత అంధ ఉపాధ్యాయుల బదిలీలను నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించినట్లు తెలిసింది. మరోవైపు విడాకులు తీసుకున్న వారికి బదిలీల్లో ప్రాధాన్య పాయింట్లు ఇవ్వలేదని మరికొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై ఇంత వరకు ఎలాంటి ఆదేశాలూ రాలేదు.

 

ఉమ్మడి జిల్లాల వారీగా ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాను విద్యాశాఖ సిద్ధం చేసింది. గత ప్రభుత్వంలో తీసుకొచ్చిన జీవో -117కు ప్రత్యామ్నాయంగా ఇప్పటికే పోస్టుల హేతుబద్ధీకరణ ప్రక్రియ పూర్తి చేశారు. బదిలీలను ఆన్ లైన్ లోనే నిర్వహిస్తారు. మే31 నాటికి ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు, అయిదేళ్ల సర్వీసు పూర్తయిన హెచ్ఎంలకు తప్పనిసరిగా బదిలీ ఉంటుంది. రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.