విశాఖకు వెళ్లనున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. బహిరంగ సభలో పాల్గొని..

స్టీల్ ప్లాంటును ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని, పూర్తి సామర్థ్యంతో నడపాలని..

విశాఖకు వెళ్లనున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. బహిరంగ సభలో పాల్గొని..

CM Revanth Reddy

Updated On : March 7, 2024 / 10:00 AM IST

CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 11న విశాఖకు వెళ్లనున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఇతర కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో బహిరంగ సభ జరగనుంది. ముఖ్యమంత్రి హోదాలో విశాఖకు రేవంత్ రెడ్డి వెళ్తుండడం ఇదే తొలిసారి.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏపీలో పలు సంఘాలు నిరసనలు తెలుపుతున్న విషయం తెలిసిందే. స్టీల్ ప్లాంటును ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని, పూర్తి సామర్థ్యంతో నడపాలని డిమాండ్లతో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇటీవలే మహా పాదయాత్రలో ఉక్కు కార్మికులు కూడా పాల్గొన్నారు.

ప్రజల త్యాగాలతో ఏర్పడిన విశాఖ ఉక్కు పరిశ్రమ మనుగడ సాగించడమే ప్రశార్థకంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్ర ప్రజలు పోరాడి సాధించుకున్న స్టీల్‌ప్లాంట్‌ ఆస్తులను కేంద్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టిందంటూ, అందుకు వ్యతిరేకంగా విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఆ ప్లాంట్‌కు విశాఖ నగరంలో పలు ప్రాంతాల్లో వేల ఎకరాల భూములు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా చాలా కాలంగా కార్మికులు, ఉద్యోగులు ఆందోళనలు చేస్తున్నారు.

Bandi Sanjay Comments : ప్రధాని మోదీని సీఎం రేవంత్ కలిస్తే తప్పేంటి? : బండి సంజయ్