Telugu States coronavirus : ఎన్ని కేసులు నమోదయ్యాయంటే
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య వేయికి చేరువైంది. రాష్ట్రంలో పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతునే ఉన్నాయి తప్ప ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. నిన్న నమోదైన 15 కొత్త కేసులతో కలిపి రాష

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య వేయికి చేరువైంది. రాష్ట్రంలో పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతునే ఉన్నాయి తప్ప ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. నిన్న నమోదైన 15 కొత్త కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 943కి చేరింది. నిన్న నమోదైన 15 కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 10 కేసులు నమోదు కాగా…సూర్యాపేట జిల్లాలో 3 కేసులు.. జోగులాంబ గద్వాల జిల్లాలో 2 కేసులు నమోదయ్యాయి. ఇక నిన్న ఒకరు మృతి చెందగా…రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 24కు చేరింది. 194 మంది కరోనా మహహ్మరి నుంచి బయటపడి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
ఇక సూర్యాపేట జిల్లాలో కరోనా వైరస్ విస్తరిస్తునే ఉంది. నిన్న జిల్లాలో 3 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే మొన్న ఒక్కరోజే 26 మందికి కరోనా పాజిటివ్ రావడం…మరుసటి రోజుకు ఆ సంఖ్య 3కు చేరడంతో జిల్లా కాస్త ఊపిరి పీల్చుకున్నారు. దీంతో జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసులు 83కి చేరాయి.
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో టెస్ట్‌ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి హోమ్ క్వారంటైన్‌ను 28 రోజులుగా నిర్ణయించింది. గతంలో ఇది 14 రోజులుగా ఉండేది. అలాగే.. ఇకనుంచి ప్రైమరీ కాంటాక్ట్‌కి మాత్రమే టెస్ట్‌లు చేయాలని.. సెకండరీ కాంటాక్ట్‌కు టెస్ట్‌లు అవసరం లేదని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం.
ఏపీలో :-
ఏపీలో కరోనా చాపకింది నీరులా విస్తరిస్తోంది. రాష్ట్రంలో రోజురోజుకు కేసులు పెరుగుతూ వస్తున్నాయి. పాజిటివ్ కేసుల్లో ఏపీ…అటు తెలంగాణలో పోటీ పడుతోంది. తెలంగాణలో కేసుల సంఖ్య 943కే చేరగా..ఆ సంఖ్య ఏపీలో 813కు చేరింది. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో ఏకంగా 56 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ 56 కేసుల్లో గుంటూరు, కర్నూలులో జిల్లాల్లోనే అత్యధికంగా 19 కేసుల చొప్పున నమోదయ్యాయి. ఇక నిన్న మరో ఇద్దరి మృతితో మృతుల సంఖ్య 24కి చేరింది.
రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో అత్యధికంగా 203 పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఆ తర్వాత గుంటూరు జిల్లా 177 కేసులతో రెండో స్థానంలో ఉంది. మొత్తం13 జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు 11 జిల్లాల్లో నమోదుకాగా.. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కృష్ణా జిల్లాలో 86 కేసులతో మూడోస్థానంలో ఉంది.. ఏపీలో కొత్తగా 24 మంది డిశ్చార్జ్ అయ్యారు. వీరిలో గుంటూరు 8, అనంతపూర్ 5, కడప 4, నెల్లూరు 4, కృష్ణా 2, విశాఖ ఒక్కరు డిశ్చార్జ్ అయ్యారని అధికారులు వెల్లడించారు. దీంతో మొత్తం 120 మంది ఇప్పటి వరకూ కరోనా నుంచి కోలుకున్నారు.