Hindupuram: హిందూపురంలో ఉద్రిక్తత.. ఇద్దరు వైసీపీ నేతల అరెస్ట్
పోలీసులతో వైసీపీ నేతలు వాగ్వాదానికి దిగారు.
Hindupuram: వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, పెద్దారెడ్డితో పాటు పలువురు నేతలను శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణ సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు. హిందూపురంలో వైసీపీ నేతల పర్యటనకు అనుమతి లేదని పోలీసులు చెప్పారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది.
అనంత వెంకటరామి రెడ్డి, పెద్దారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి తరలించారు. పోలీసులతో వైసీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. హిందూపురం పర్యటన చేయడానికి వైసీపీ నేతలకు అనుమతి లేదని పోలీసులు చెప్పారు. (Hindupuram)
Also Read: బిహార్‌లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు కౌంట్‌డౌన్.. ఉత్కంఠ.. ఏం జరుగుతోందంటే?
తమ పార్టీ కార్యాలయానికి వెళ్లటానికి పోలీసుల పర్మిషన్ ఎందుకని వైసీపీ నేతలు మండిపడ్డారు. రోడ్డు పై బైఠాయించి వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగి, న్యాయం కావాలని, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
బాలకృష్ణ రోడ్ షో నేపథ్యంలో హిందూపూర్‌లో రెండు రోజులుగా టీడీపీ, వైసీపీ నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. హిందూపురం వైసీపీ కార్యాలయంపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారని, వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదంటూ వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, బాలకృష్ణ ఇవాళ శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో పర్యటిస్తున్నారు.
